హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

కరోనా సోకినవారికి రూ.10వేలు, క్వారంటైన్‌కు వెళ్లినవారికి రూ.3వేలు.. వైసీపీ ఎమ్మెల్యే సాయం..

కరోనా సోకినవారికి రూ.10వేలు, క్వారంటైన్‌కు వెళ్లినవారికి రూ.3వేలు.. వైసీపీ ఎమ్మెల్యే సాయం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వ విప్, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రభుత్వ విప్, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అందరూ భయపడుతున్న వేళ.. కరోనా బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. కరోనా వైరస్ సోకిన వారికి రూ.10వేలు, క్వారంటైన్‌కు వెళ్లాల్సి వస్తే వారికి రూ.3వేలు సాయం చేస్తానని ప్రకటించారు. దీనికి సంబంధించి తొలివిడుతగా రూ.25 లక్షల చెక్‌ను అందజేశారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ద్వారా పద్మావతి క్వారంటైన్ సెంటర్‌కు అందజేశారు. కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందించిన తర్వాత వారు కోలుకుని ఇంటికి వెళ్లే సమయంలో ప్రభుత్వం రూ.2వేలు అందిస్తోంది. దానికి అదనంగా చెవిరెడ్డి మరో రూ.10వేలు అందిస్తారు. అలాగే, ఒక కుటుంబంలో ఒకరికి కరోనా సోకితే, వారి కుటుంబంలో ముగ్గురు, లేదా నలుగురు క్వారంటైన్‌కు వెళ్లాల్సి వస్తుంది. వారికి ఒక్కొక్కరికి రూ.3వేల చొప్పున సాయంచేస్తానని చెవిరెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చిన దానికి ఇది అదనం అని స్పష్టం చేశారు.

  Chevireddy Bhaskar reddy,Chevireddy news,TTD adminstrative council,chevireddy news,ttd news,tirumala news,చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,చెవిరెడ్డి వార్తలు,టీటీడీ పాలకమండలి,తిరుమల న్యూస్
  జగన్‌తో చెవిరెడ్డి(ఫైల్ ఫోటో)

  ‘క్వారంటైన్ అంటేనే ప్రజలు భయపడుతున్నారు. కుటుంబం పోషణ ఎలా అనే భయం వారిలో ఉంది. అందుకే ఈ సాయం చేస్తున్నారు. వారు కరోనా నుంచి కోలుకుని ఇంటికి వచ్చే సమయంలో, అలాగే, కుటుంబసభ్యులు క్వారంటైన్ నుంచి బయటకు వచ్చే సమయంలో సాయం చేయడం ద్వారా వారిలో ధైర్యం ఉంటుంది. వారికి పోషకాహారం కోసం, కుటుంబ పోషణ కోసం ఆ డబ్బులు పనికొస్తాయి.’ అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, Chevireddy bhaskar reddy

  ఉత్తమ కథలు