కరోనాతో భారత మాజీ క్రికెటర్ ఆరోగ్యం విషమం..

భారత్‌ తరఫున 40 టెస్టులు ఆడిన చౌహాన్‌.. సునీల్‌ గవాస్కర్‌తో కలసి కొన్నాళ్లు ఓపెనర్‌గా బరిలో దిగారు.

news18-telugu
Updated: August 15, 2020, 6:59 PM IST
కరోనాతో భారత మాజీ క్రికెటర్ ఆరోగ్యం విషమం..
చేతన్ చౌహాన్ (File:ANI)
  • Share this:
భారత మాజీ క్రికెటర్‌ చేతన్‌ చౌహాన్‌ ఆరోగ్యం విషమంగా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఆయన చికిత్స పొందుతున్నారు. గతనెలలో కరోనా బారినపడిన మాజీ ఓపెనర్‌ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. ఆయన శరీరంలోని చాలా అవయవాలు ఇప్పటికే పూర్తిగా దెబ్బతిన్నాయి. గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంలో 73 ఏండ్ల చౌహాన్‌ కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు. జూలై 12 కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన లక్నోలోని సంజయ్‌ గాంధీ పీజీఐ హాస్పిటల్‌లో చేరారు. అక్కడ అతని ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడకపోగా మరింత క్షీణించింది. దీంతో ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంతకు తరలించారు. చికిత్స సమయంలోనే ఆయనకు బీపీతో పాటు కిడ్నీ సంబంధ సమస్యలు తలెత్తాయి. భారత్‌ తరఫున 40 టెస్టులు ఆడిన చౌహాన్‌.. సునీల్‌ గవాస్కర్‌తో కలసి ఓపెనర్‌గా బరిలో దిగారు. అలాగే ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్స్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో పలు హోదాల్లో పనిచేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 15, 2020, 6:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading