Coronavirus | ‘ఈ మంత్రం చదివితే కరోనా మీ దరికి చేరదు..’

Coronavirus : మందులు, సూదుల అవసరం లేకుండానే ఓ మంత్రాన్ని చదివి కరోనాను తరిమికొట్టవచ్చని అంటున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త దలైలామా.

news18-telugu
Updated: January 30, 2020, 2:33 PM IST
Coronavirus | ‘ఈ మంత్రం చదివితే కరోనా మీ దరికి చేరదు..’
టిబెటిన్ ఆధ్యాత్మిక గురువు దలై లామా(ఫైల్ ఫోటో)
  • Share this:
కరోనా వైరస్(Coronavirus) దెబ్బకు ప్రపంచమంతా భయపడుతోంది. ఇప్పటికే దీని బారిన పడి 132 మంది చైనీయులు మృతి చెందగా, వందలాది మంది దీనికి ప్రభావితమయ్యారు. అసలు ఇప్పటి వరకు ఈ వ్యాధిని గుర్తించేందుకు రాష్ట్రాల చెంతకు సరైన పరికరాలే అందుబాటులోకి రాలేదు. అయితే.. మందులు, సూదుల అవసరం లేకుండానే ఓ మంత్రాన్ని చదివి కరోనాను తరిమికొట్టవచ్చని అంటున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త దలైలామా. వివరాల్లోకెళితే.. ఈ వైరస్ వ్యాప్తి చెందగానే పలువురు చైనా భక్తులు దీనికి విరుగుడు చెప్పాలని ఫేస్‌బుక్ ద్వారా దలైలామాను కోరారు. దీంతో వారి కోరిక మేరకు తారా మంత్రాన్ని పఠించాలని సూచించారు. దాన్న పఠిస్తే కరోనా దరికి చేరదని, దాన్ని విముక్తి పొందవచ్చని చెప్పారు.

ఆ తారా మంత్రం ఏంటంటే.. ‘ఓం తారే తుత్తారే తూరే సోహా’. దీన్ని పఠించడం వల్ల మెదడు ప్రశాంతంగా, ఆందోళనలను దూరంగా ఉంచుతుందని వెల్లడించారాయన. స్వయంగా తానే ఆ మంత్రాన్ని పఠించి వాయిస్ మెసేజ్‌ను షేర్ చేశారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: January 30, 2020, 2:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading