జేసీబీలతో కరోనా మృతదేహాల ఖననం.. జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం

కొన్ని రోజుల క్రితం శ్రీకాకుళంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఈ వ్యవహారంలో సీఎం వైఎస్ జగన్ స్వయంగా జోక్యం చేసుకోవడంతో.. అధికారులను సస్పెండ్ చేశారు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు.

news18-telugu
Updated: July 10, 2020, 2:18 PM IST
జేసీబీలతో కరోనా మృతదేహాల ఖననం.. జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
కరోనా వైరస్ మనుషుల్లోని మానవత్వాన్ని చంపేస్తోంది. మనిషి అంత్యక్రియలకు ఎంతో విలువనిచ్చే మనదేశంలో.. కరోనాతో చనిపోయిన వారి కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది కనీస మానవత్వం మరించి ఆ మృతదేహాలను ఈడ్చుకుంటూ వెళ్తున్నారు. జేసీబీలతోనే అంత్యక్రియలు చేస్తున్నారు. మొన్న శ్రీకాకుళం.. నిన్న తిరుపతి.. ఇవాళ నెల్లూరులోనూ ఇలాంటి ఘటన జరిగింది. పెన్నా నది తీరంలో కరోనా మృతదేహాలను ఒకే గంతలో జేసీబీతో పూడ్చిపెట్టారు. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విటర్‌లో స్పందించారు.

కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను జేసీబీల సాయంతో గుంతలోకి విసిరేయడం చూసి బాధనిపించిందని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలు వరుసగా పునరావృతమవుతున్నాయని ప్రభుత్వాన్ని విమర్శించారు. మృతుల కుటుంబాలకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.


నెల్లూరు జిల్లాలోని పెన్నా నది తీరంలో మృతదేహాలను అత్యంత దారుణంగా ఖననం చేశారు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను పారిశుద్ధ్య సిబ్బంది వ్యాన్ నుంచి కిందకు దించి వాటిని జేసీబీలోకి విసిరేశారు. తర్వాత జేసీబీ సాయంతో గోతిలోకి విసిరేశారు. ఈ సీన్ మొత్తాన్ని రోడ్డుపై వెళుతున్నవారు వీడియో తీశారు. ఆ వెంటనే ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడం.. అవి కాస్త వైరల్ అవ్వడంతో ఈ అమానుషం బయటపడింది. అయితే పెన్నా నది ఒడ్డున ఖననం చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు.

కొన్ని రోజుల క్రితం శ్రీకాకుళంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఈ వ్యవహారంలో సీఎం వైఎస్ జగన్ స్వయంగా జోక్యం చేసుకోవడంతో.. అధికారులను సస్పెండ్ చేశారు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు. ఆ తర్వాత తిరుపతిలో.. తాజాగా నెల్లూరులోనూ అలాంటి ఘటనలే వెలుగుచూశాయి.
Published by: Shiva Kumar Addula
First published: July 10, 2020, 2:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading