CENTRE WROTE LETTER TO 9 STATES REGARDING COVID 19 TESTS AND OMICRON ISSUES AK
Omicron: కరోనా విజృంభణ.. ఇలా చేయాలంటూ ఆ రాష్ట్రాలకు కేంద్రం లేఖ..
ప్రతీకాత్మక చిత్రం
Omicron: తగిన పరీక్షలు చేయకపోతే.. దేశంలో వైరస్ వాస్తవ స్థితి తెలియదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఆర్తీ అహుజా రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు
దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల ముప్పుతో కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కేసులు వేగంగా పెరుగుతుండటంతో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తోంది. అయితే చాలా రాష్ట్రాలు కరోనా పరీక్షపై తక్కువ శ్రద్ధ చూపుతున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంపై 8 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కేంద్రం లేఖ రాసి హెచ్చరించింది. తగిన పరీక్షలు చేయకపోతే.. దేశంలో వైరస్ వాస్తవ స్థితి తెలియదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఆర్తీ అహుజా రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తమిళనాడు, పంజాబ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మిజోరాం, మేఘాలయ, బీహార్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు కేంద్ర లేఖ రాసిన రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయని... పెద్ద సంఖ్యలో టీకాలు వేసినప్పటికీ అనేక దేశాలలో ఓమిక్రాన్ కేసులు చాలా రెట్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కరోనా కట్టడికి చేస్తున్న ప్రయత్నాలు నిర్వీర్యం కాకుండా ఉండడానికి నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఒమిక్రాన్ చాలా వేగవంతమైన ఇన్ఫెక్షన్ సామర్థ్యాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ చాలా సందర్భాల్లో లక్షణాలు లేకుండా కనిపిస్తున్నాయని తెలిపింది. అటువంటి పరిస్థితిలో పరీక్షల వేగాన్ని పెంచినట్లయితే.. వైరస్ సోకిన వ్యక్తులు దీన్ని ఎక్కువగా వ్యాప్తి చేయలేదని పేర్కొంది.
ఇదిలా ఉంటే దేశంలో గత 24 గంటల్లో 90,928 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి, ఇది బుధవారం కంటే 56.5 శాతం ఎక్కువ. గత 24 గంటల్లో 325 మంది కరోనా బారిన పడి మరణించారు. ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువగా ఉన్నందున.ఇదంతా ఒమిక్రాన్ ప్రభావమే అని కేంద్రం వెల్లడించింది. అయితే డేటాను క్రమం చేయకుండా ఇది చెప్పడం సాధ్యం కాదని పేర్కొంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.