Home /News /coronavirus-latest-news /

CENTRE TO CONDUCT RAPID TESTS FOR CORONA VIRUS PREVENTION IN THREE TELANGANA DISTRICTS AK

తెలంగాణలోని ఆ మూడు జిల్లాల్లో ర్యాపిడ్ టెస్టులు... కేంద్రం కీలక నిర్ణయం...

ఒకవేళ O బ్లడ్ గ్రూప్ ఉన్న వారికి కరోనా వైరస్ సంక్రమించినా కూడా అవయవాల మీద తీవ్ర ప్రభావం చూపే చాన్స్ కూడా చాలా తక్కువని పరిశోధనలో తేలింది.

ఒకవేళ O బ్లడ్ గ్రూప్ ఉన్న వారికి కరోనా వైరస్ సంక్రమించినా కూడా అవయవాల మీద తీవ్ర ప్రభావం చూపే చాన్స్ కూడా చాలా తక్కువని పరిశోధనలో తేలింది.

కరోనా తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాలో ర్యాండంగా ర్యాపిడ్ టెస్టులు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

    కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే అనేక రాష్ట్రాలు ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నాయి. తాజాగా ఈ టెస్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాలో ర్యాండంగా ర్యాపిడ్ టెస్టులు చేయాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా లక్షణాలు ఉన్నా లేకపోయినా నిర్ణీత ప్రాంతాన్ని ఎంచుకుని కొంతమందికి పరీక్షలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ పరీక్షలకు తెలంగాణలోని నల్గొండ, జనగామ, వికారాబాద్‌ను ఎంచుకున్నారు. ఈ మేరకు ఐసీఎంఆర్ అధికారులు నేడు నల్గొండ జిల్లాకు రానున్నారు.

    జిల్లాలో ఇప్పటి వరకు 549 మందిని పరీక్షించగా 15 మందికి మాత్రమే కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ పరిణామాల మధ్య జిల్లాలో మరిన్ని పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఈ ర్యాపిడ్ టెస్టులో భాగంగా ఒక్కో క్లస్టర్ నుంచి 4 వందల నమూనాలను సేకరిస్తారు. కేవలం 15 నిముషాల్లో పరీక్షా ఫలితాలు వెల్లడిస్తారు. మరో 15 రోజుల తర్వాత మరోసారి జిల్లాలో 4 వందల శాంపిల్స్‌ను సేకరించనున్నారు. అనంతరం వరుసగా మూడు నెలలపాటు ప్రతి నెల 4 వందల శాంపిళ్లను పరీక్షిస్తారు. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ఎప్పటికప్పుడు టెస్టులు చేయడం ఒక్కటే ఏకైన మార్గమని భావిస్తున్న కేంద్రం... ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Coronavirus, Covid-19, Telangana, Union government

    తదుపరి వార్తలు