Home /News /coronavirus-latest-news /

CENTRE SAYS COVID 19 SECOND WAVE WILL BE FAR AWAY FROM ENDING IF CASES IN KERALA COMES DOWN AK

Covid 19 Cases: కేరళలో కరోనా కేసుల ఉధృతిపై కేంద్రం కీలక వ్యాఖ్యలు..

 ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Kerala: కేరళలోని కరోనా శాంపిల్స్‌ను పరిశీలిస్తే.. అక్కడ కరోనా కేసుల్లో 80 శాతం డెల్టా వేరియంట్ ఉందని కేంద్రం పేర్కొంది.

    దేశంలో ఇప్పుడు అంతా కరోనా థర్డ్ వేవ్ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. రోజూవారీ కేసులు ఏ మాత్రం పెరిగినా.. దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదని అన్నారు. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 70 శాతం కేరళలోనే నమోదవుతున్నాయని.. అక్కడ కేసులు నియంత్రణలోకి వచ్చే వరకు కరోనా సెకండ్ వేవ్ కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. బుధవారం దేశవ్యాప్తంగా నమోదైన 47,092 కరోనా కొత్త కేసుల్లో ఒక్క కేరళలోనే 32,803 కేసులు వెలుగు చూశాయి. బుధవారం దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య పెరిగింది. అయితే కేరళలో కేసుల పెరుగుదల కారణంగానే ఈ సంఖ్య పెరిగినట్టు అర్థమవుతోంది.

    ఒకవేళ కేరళ కేసులను తీసి చూస్తే.. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువ. ప్రస్తుతం కేరళలోని 11 జిల్లాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ రాజేశ్ భూషణ్ తెలిపారు. మలప్పురం, ఎర్నాకుళం, త్రిసూరు, కోజికోడ్, పాలక్కడ్, కొల్లాం, కన్నూరు, కసర్‌గాడ్, వాయనాడ్, పథనంతిట్ట, ఇడుక్కి జిల్లాలో కరోనా విలయం కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

    కేరళలోని కరోనా శాంపిల్స్‌ను పరిశీలిస్తే.. అక్కడ కరోనా కేసుల్లో 80 శాతం డెల్టా వేరియంట్ ఉందని పేర్కొన్నారు. అక్కడ పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపించింది. స్వయంగా కేంద్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ గత నెలలో అక్కడ పర్యటించారు.

    రాష్ట్ర ప్రభుత్వం కాంటాక్ట్ ట్రేసింగ్‌ చేయడంలో రాష్ట్రం బలహీనంగా ఉందని కేంద్రం సంస్థలు అభిప్రాయపడ్డాయి. కేరళలో కంటైన్మెంట్ చర్యలు కూడా సరిగ్గా తీసుకోవడం లేదని పేర్కొన్నారు. కేరళలో కరోనా నియంత్రణ కోసం ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజీ 2 కింద కేంద్రం 267 కోట్లు విడుదల చేసింది. దీంతో పాటు ప్రతి జిల్లాకు రూ. కోటి విడుదల చేసింది.

    ఇదిలా ఉంటే కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ రాష్ట్రంలో స్కూల్స్ తెరిచే అంశాన్ని పరిశీలించేందుకు కేరళ సర్కార్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శివన్‌కుట్టి తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించడాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమర్థించుకున్నారు. కమిటీ నివేదిక ఆధారంగా సీఎం విజయన్ దీనిపై నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.

    Huzurabad: హుజూరాబాద్‌లో పోటీకి దూరం.. ఆ పార్టీ ప్రకటన.. టీఆర్ఎస్‌కు మద్దతిస్తుందా ?

    Night: రాత్రిపూట తరచూ గొంతు తడారిపోతుందా ?.. చాలా డేంజర్.. దేనికి సంకేతమో తెలుసా..


    గతంలో పిల్లలందరికీ వ్యాక్సిన్ ఇచ్చిన తరువాతే స్కూల్స్ తెరుస్తామని కేరళ సర్కార్ ప్రకటించింది. అయితే పొరుగు రాష్ట్రం తమిళనాడు స్కూల్స్ తెరవడంతో కేరళ కూడా ఈ దిశగా ఆలోచిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య పెద్దగా లేదని.. కాబట్టి పరిస్థితి అదుపులోని ఉందని నిపుణుల సమావేశంలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Coronavirus, Kerala

    తదుపరి వార్తలు