హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

కరోనా కట్టడికి సీఎం జగన్ నిర్ణయాలపై WHO ఆరా... వైసీపీ ఎంపీ...

కరోనా కట్టడికి సీఎం జగన్ నిర్ణయాలపై WHO ఆరా... వైసీపీ ఎంపీ...

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  (File))

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (File))

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై WHO ఆరా తీస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరా తీస్తోందని వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘రాష్ట్రాధినేత సమర్థత, సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలిగే చొరవ సంక్షోభ సమయాల్లో ప్రజలను ఆపద నుంచి గట్టెక్కిస్తాయి. కోవిడ్ నియంత్రణ, తక్కువ ప్రాణనష్టంతో ఏపి దిశా నిర్దేశం చేస్తుంది. ప్రతి రాష్ట్రం మనల్ని అసుసరిస్తుంది. కేంద్రం ఇప్పటికే ప్రశంసించింది. WHO కూడా ఆరా తీస్తోంది.’ అని విజయసాయిరెడ్డి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

కొత్తగా నమోదైన 61 కేసులతో కలిపి ఆంధ్ర ప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 1016కి చేరింది. మరో ఇద్దరు చనిపోవడంతో... మొత్తం మృతుల సంఖ్య 31కి చేరింది. ఇప్పటివరకూ 171 మంది డిశ్చార్జి అవ్వడంతో... ప్రస్తుతం 814 మంది కరోనాతో ఐసోలేషన్ కేంద్రాల్లో ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. అలాగే... గత 24 గంటల్లో ప్రభుత్వం 6928 శాంపిల్ టెస్టులు జరపగా... వారిలో 61 మందికి కరోనా సోకినట్లు తెలిసింది. దేశంలో ఎక్కువ టెస్టులు జరుపుతున్న రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింది. జిల్లాల్లో చూస్తే... 275 కేసులతో కర్నూలు మొదటి స్థానంలో ఉండగా... 209 కేసులతో గుంటూరు రెండో స్థానంలో ఉంది.

ఏపీలో ఇప్పటి వరకు 61, 216 టెస్టులు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. ప్రతి 10 లక్షల మందిలో 1147 టెస్టులు చేయడం ద్వారా దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసుల శాతం 1.66 ఉంది. మిగిలిన రాష్ట్రాల తో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దక్షిణకొరియా నుంచి లక్ష ర్యాపిడ్ కిట్లను కొనుగోలు చేసింది. అలాగే, చికిత్స తీసుకుంటున్న వారికి పౌష్టిక ఆహారం అందించడంతో పాటు వారిలో మానసిక ధైర్యం పెంపొందించేందుకు చర్యలు చేపట్టింది. కోలుకున్న బాధితులు ఇంటికి వెళ్లేటప్పుడు రూ.2000, పండ్లు ఇచ్చి పంపుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Coronavirus, Covid-19, Vijayasai reddy

ఉత్తమ కథలు