మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగింపు.. కేంద్రం నిర్ణయం?

Lockdown Extension | లాక్ డౌన్ 5 కూడా విధించేలా కేంద్రం ఆలోచిస్తున్నట్టు సమాచారం. లాక్ డైన్ 4 .0 గడువు మే 31తో ముగుస్తుంది.


Updated: May 27, 2020, 3:13 PM IST
మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగింపు.. కేంద్రం నిర్ణయం?
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్ డౌన్ 5లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సడలింపులు జూన్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి.
  • Share this:
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ 5 కూడా విధించేలా కేంద్రం ఆలోచిస్తున్నట్టు సమాచారం. లాక్ డైన్ 4 .0 గడువు మే 31తో ముగుస్తుంది. లాక్ డౌన్ 4లో కొన్ని సడలింపులు ఇచ్చారు. అయితే, లాక్ డౌన్ 5లో కూడా మరికొన్ని సడలింపులు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కర్ణాటక ప్రభుత్వం కోరినట్టు ఆలయాలు, ప్రార్థనా మందిరాలు కూడా తెరిచేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రాల మధ్య రవాణా అంశంపై కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పటి వరకు రాష్ట్రాల పరస్పర అంగీకారంతో అంతర్రాష్ట్ర రవాణా జరుపుకోవచ్చని గతంలో కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల్లో పేర్కొంది.

భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య లక్షన్నరకు చేరుకుంది. అందులో 70 శాతం కేసులు కేవలం 11 నగరాల నుంచే వస్తున్నాయి. అందులో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, కోల్ కతా, పూణె, థానే, జైపూర్, సూరత్, ఇండోర్‌లో కరోనా కేసులు కలిపితే దేశంలోనే 70 శాతం కేసులు ఉన్నాయి. గత 14 రోజుల్లోనే కరోనా కేసుల సంఖ్య రెండింతలు అయింది. అలాగే, కరోనా మరణాల సంఖ్య 4337గా ఉంది. అంటే, గత 16 రోజుల్లోనే మరణాల రేటు కూడా డబుల్ అయింది.

First published: May 27, 2020, 3:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading