Home /News /coronavirus-latest-news /

CENTRE GOVERNMENT MAY GIVE VACCINE TO 12 TO 14 AGE GROUP FROM MARCH SAYS NK ARORA AK

Vaccine: వ్యాక్సినేషన్‌పై కేంద్రం మరో కీలక నిర్ణయం.. త్వరలోనే ఆ వయసు వారికి కూడా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Vaccine: ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్ల మధ్య వ్యక్తులకు కరోనా టీకా ఇస్తున్న కేంద్రం.. తాజాగా మరో ఏజ్ గ్రూప్ వారికి కూడా వ్యాక్సిన్ ఇచ్చే అంశంపై స్పష్టత ఇచ్చింది.

    కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్ల మధ్య వ్యక్తులకు కరోనా టీకా ఇస్తున్న కేంద్రం.. తాజాగా మరో ఏజ్ గ్రూప్ వారికి కూడా వ్యాక్సిన్ ఇచ్చే అంశంపై స్పష్టత ఇచ్చింది. ఈ ఏడాది మార్చి నుంచి 12 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉందని కేంద్ర కరోనా టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా తెలిపారు. అప్పటికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులకు కరోనా టీకా ఇచ్చే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో.. 12 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

    15-18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా టీకాలు జనవరి 3 నుంచి వేయడం ప్రారంభించారు. ఈ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ డ్రైవ్ చేపట్టిన తొలి రోజే 42,06,433 మంది పిల్లలకు టీకాలు వేశారు. మరోవైపు కరోనాకు వ్యతిరేకంగా జాతీయ టీకా ప్రచారం జనవరి 16, 2022 నాటికి ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా టీకా డ్రైవ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సెల్యూట్ చేశారు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలను ప్రధాని మోదీ ప్రశంసించారు. కోవిడ్-19కి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి భారత్ టీకా కార్యక్రమం గొప్ప బలాన్ని చేకూర్చిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. జాతీయ కోవిడ్ టీకా కార్యక్రమం మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా COVID-19 వ్యాక్సిన్‌పై స్మారక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. ఇక దేశంలో 70 శాతం మంది పెద్దలకు పూర్తిగా కరోనా టీకాలు వేసినట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు. 93 శాతం మందికి మొదటి డోసు ఇచ్చినట్టు వెల్లడించారు. దేశంలో జనవరి 16, 2021న కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదటి దశ ప్రారంభమైంది. రెండవ దశ టీకాలు వేసే డ్రైవ్ మార్చి 1న ప్రారంభమైంది. మే 1న పెద్దలందరికీ టీకా కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది.

    మరోవైపు దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. నిన్న 2,58,089 కొవిడ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిలెన్‌లో తెలిపింది. అలాగే, నిన్న‌ 385 మంది మ‌ర‌ణించార‌ని వివ‌రించింది. నిన్న క‌రోనా నుంచి 1,51,740 మంది కోలుకున్నారని పేర్కొంది.

    India corona update : దేశంలో కరోనా విలయం : ఒక్కరోజులోనే 2.59లక్షల కేసులు, 358 మరణాలు

    Covid Vaccination: వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌కు ఏడాది.. ఏం సాధించామో తెలుసుకోండి!

    ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 16,56,341 మందికి చికిత్స అందుతోందని తెలిపింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 19.65 శాతంగా ఉందని పేర్కొంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య‌ 8,209కి పెరిగింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 70.37 కోట్ల క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు. నిన్న‌ ఒక్కరోజే 13,13,444 ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు కేంద్రం వివ‌రించింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: COVID-19 vaccine

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు