Coronavirus: డాక్టర్లు, వైద్య సిబ్బందికి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం

ప్రధానమంత్రి గరీబ్‌‌ కల్యాణ్‌ ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మార్చిలో ఈ పథకాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా 22.12 లక్షల మందికి వర్తిస్తుంది.

news18-telugu
Updated: June 21, 2020, 6:31 PM IST
Coronavirus: డాక్టర్లు, వైద్య సిబ్బందికి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనాపై జరుగుతున్న పోరాటంలో డాక్టర్లు ముందు వరసలో ఉన్నారు. ప్రాణాలకు తెగించి మరీ.. కోవిడ్ పేషెంట్లకు ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ రోగులకు కాపాడేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు. అలాంటి వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్లు, వైద్య సిబ్బందకి వర్తించే రూ.50 లక్షల ప్రమాద బీమా పథకాన్ని మరో మూడు నెలలు పొడిగించింది. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది కోసం మార్చి 30న వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని ప్రకటించింది. ఐతే ఈ నెలాఖరుతో పథకం గడువు ముగియనున్న నేపథ్యంలో మరో 90 రోజుల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఈ బీమా సదుపాయం సెప్టెంబర్‌ వరకు అమలులో ఉండనుంది. ప్రధానమంత్రి గరీబ్‌‌ కల్యాణ్‌ ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మార్చిలో ఈ పథకాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా 22.12 లక్షల మందికి వర్తిస్తుంది.

ఇండియాలో గత 24 గంటల్లో ఏకంగా 154136 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 4 లక్షలు దాటి... 410461కి చేరింది. నిన్న 306 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 13254కి చేరింది. ఇండియాలో కరోనా వల్ల ఒకే రోజు ఇంత ఎక్కువ మంది చనిపోవడం ఇదే తొలిసారి. గత 24 గంటల్లో 13925 మంది రికవరీ అవ్వడంతో... మొత్తం రికవరీ కేసుల సంఖ్య 227755కి చేరింది. ఫలితంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 169451గా ఉంది.
First published: June 21, 2020, 6:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading