HOME »NEWS »Corona vilayatandavam »centre clarifies that no coronavirus in 15 member returned from united kingdom ak gh

Fact Check: బ్రిటిన్ నుంచి వచ్చిన ఆ 15 మందికి కరోనా.. నిజమెంత ?

Fact Check: బ్రిటిన్ నుంచి వచ్చిన ఆ 15 మందికి కరోనా.. నిజమెంత ?
(ప్రతీకాత్మక చిత్రం )

Fact Check: యూకే నుంచి భారత్ వస్తున్న ప్రతి ఒక్కరినీ ట్రాక్ చేసి వారికీ ఆర్టీ పీసీఆర్(RT PCR) పరీక్షలు తప్పనిసరి చేసింది. సోమవారం నుంచి యూకే నుంచి వచ్చిన పలువులు ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

  • Share this:
కొత్త రకం కరోనా వైరస్(Covid-19) ప్రపంచాన్ని మరోసారి వణికిస్తోంది. యూకేలో బయల్పడిన ఈ మహమ్మారి వల్ల ప్రపంచ దేశాలు యూకే నుంచి ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేస్తోన్నాయి. భారత్ కూడా ఆ దేశంతో ప్రయాణాలపై తాత్కాలిక ఆంక్షలు విధించింది. అయితే యూకే(UK) నుంచి ముంబయి వచ్చిన 15 మంది ప్రయాణికులకు కరోనా నిర్దారణ అయిందని బిజినెస్ లైన్ లో వార్తలు వినిపించాయి. తాజాగా ఈ వార్తల్లో నిజం లేదని ప్రెస్ ఇన్ఫార్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్(PIB Fact check) తేల్చింది. యూకే నుంచి ముంబయి వచ్చిన 15 మంది ప్రయాణికుల్లో ఎలాంటి కరోనా వైరస్(Corona Virus) నిర్ధారణ కాలేదని, ఇది తప్పుడు వార్త పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది.

జీనోమ్ స్వీక్వెన్స్ స్థాపించిన ICMR, DBT, CSIR NCDC ప్రయోగశాలల్లో వైరస్ ఉనికి గుర్తించలేదని ప్రకటించింది. ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసింది పీఐబీ. వారికి వైరస్ నిర్ధారణ అయినట్లు వస్తున్న వార్తలు నిరాధారమని తెలిపింది. కరోనా వైరస్ ఓ వైపు ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే.. కొత్త రూపంలో మార్పు చెంది మరోసారి భయంకంపితులను చేస్తోంది. బ్రిటన్(Britan) లో వచ్చిన ఈ కొత్తరకం వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత సర్కారు సన్నద్ధమైంది. ఆ దేశం నుంచి వచ్చే విమాన సర్వీసులను(Flight Services) డిసెంబరు 31 వరకు రద్దు చేయగా.. మంగళవారం నాడు కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను వెలువరించింది. గత నాలుగు వారాల నుంచి యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల జాబితాను సేకరించి వారికి పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే ఇప్పటి వరకు భారత్ లో నూతన కరోనా వైరస్ లక్షణాలు ఎవ్వరిలోనూ కనిపించలేదు.





యూకే నుంచి భారత్ వస్తున్న ప్రతి ఒక్కరినీ ట్రాక్ చేసి వారికీ ఆర్టీ పీసీఆర్(RT PCR) పరీక్షలు తప్పనిసరి చేసింది. సోమవారం నుంచి యూకే నుంచి వచ్చిన పలువులు ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే ఇది కొత్త రకమా? కాదా అనేది తెలియాల్సి ఉంది. పాజిటివ్ వ్యక్తుల నమునాలను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. వైరస్ జీనోం వ్యవస్థపై అధ్యయనం చేయాల్సి ఉంది.

కేంద్రం నూతన మార్గదర్శకాలు
ప్రయాణికులందరూ గత 14 రోజుల ప్రయాణ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని నింపాలి. అంతేకాకుండా వెంటనే ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఒకవేళ పాజిటివ్ అని తేలితే స్పైక్ జీన్ కు చెందిన ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తారు. ఇప్పటికే ఉన్న కరోనా వైరస్ పాజిటివ్ గా తేలితే ఆ లక్షణాల తీవ్రత ఆధారంగా హోం ఐసోలేషన్ లో ఉంచడం కానీ, ఆసుపత్రులకు తరలించడం కానీ చేస్తారు. ఒకవేళ కొత్త రకం వైరస్ పాజిటివ్ గా తేలితే.. బాధితుడికి ప్రత్యేక ఐసోలేషన్ యూనిట్స్ లో చికిత్స అందిస్తారు. 14 రోజుల తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించి పాజిటివ్ గా తేలితే 24 గంటల్లో రెండు సార్లు నెగిటివ్ వచ్చే వరకు నమూనాలను తీసుకొని పరీక్షించవచ్చు. అలాగే పాజిటివ్ ఉన్న వ్యక్తితో ప్రయాణించిన వారిని సంస్థాగత క్వారంటైన్ లో ఉంచాలి.
Published by:Kishore Akkaladevi
First published:December 23, 2020, 20:16 IST

टॉप स्टोरीज