Remdesivir: కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం.. ఆ ఇంజెక్షన్ ఎగుమతులపై నిషేధం

Remdesivir: కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం.. ఆ ఇంజెక్షన్ ఎగుమతులపై నిషేధం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

  • Share this:
    దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌తోపాటుగా దాని యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాల ఎగుమతిపై నిషేధం విధించింది. "ఇటీవల దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఏప్రిల్ 11 నాటికి దేశంలో 11.08 లక్షల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ సంఖ్య క్రమంగా పెరగవచ్చు. ఈ క్రమంలోనే కోవిడ్ రోగుల చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ కోసం డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. రాబోయే రోజుల్లో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు" కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇక, ప్రస్తుతం 7 భారతీయ కంపెనీలు Gilead Sciencesతో చేసుకున్న ఒప్పందం ప్రకారం రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇవి నెలకు 38.80 లక్షల యూనిట్ల ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి.

    రెమ్‌డెసివిర్‌ సంబంధించిన స్టాకిస్టులు మరియు పంపిణీదారులు వివరాలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంచాలని ఉత్పత్తిదారులను కోరింది. రెమ్‌డెసివిర్‌ బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులు రెమ్‌డెసివిర్ నిల్వలపై నిత్యం తనిఖీ చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు, రోగులకు రెమ్‌డెసివిర్ సులువుగా అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.

    ఇక, భారత్‌లో కొత్తగా 1,52,879 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1.33 కోట్లు దాటింది. కొత్తగా 839 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1,69,275కి చేరింది. మరణాల రేటు దేశంలో 1.3 శాతం ఉంది. ఇండియాలో కొత్తగా 90,584 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 1.20 కోట్లు దాటింది. రికవరీ రేటు దేశంలో 90.4 శాతానికి పడిపోయింది. ఇండియాలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 11,08,087 ఉన్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం టెస్టుల సంఖ్య 25.66 కోట్లు దాటింది.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు