CENTRAL WRITES A LETTER TO STATES SAYING THAT IMPOSING NIGHT CURFEW IN OMICRON ALERT VRY
Omicron alert : అవసరమైతే... నైట్ కర్ఫ్యూ పెట్టండి.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్..నోట్..
night curfew
Omicron alert : ఒమిక్రాన్ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే నైట్ కర్ఫ్యూ విధించాలని రాష్ట్రాలకు లేఖలు రాసింది. పదిశాతం కంటే ఎక్కువ పాజివిటి రేటు ఉన్న ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలని సూచించింది.
ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న ఒమిక్రాన్ పై ( Omicron ) భారత ప్రభుత్వం అలర్ట్ అయింది.. అంత్యంత వేగంగా విజృంభిస్తున్న ఒమిక్రాన్‌పై భారత్ మరింత అప్రమత్తమైంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్న తరుణంలో రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా దేశంలోని రాష్ట్రాలను అప్రత్తం చేశారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్. ఈ క్రమంలోనే రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ పెట్టాలంటూ లేఖలు రాశారు. కొవిడ్ నిబంధనలపై నిర్లక్షంగా ఉండకపోవడంతో పాటు వైరస్ వ్యాప్తి చెందుతున్న జిల్లాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ సంధర్భంగా దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉందని లేఖలో పేర్కొన్నారు. కేరళ, మీజోరాం, సిక్కిం జిల్లాల్లో ఒమిక్రాన్ పాజిటివిటి రేటు పదిశాతం కంటే ఎక్కువగా ఉందని , మిగతా ఏడు రాష్ట్రాల్లోని 10 జిల్లాల్లో పాజిటివిటి రేటు 5 నుండి పది శాతంగా నమోదైందని లేఖలో పేర్కొన్నారు.
ఏదైనా జిల్లాలోనైనా పాజిటిటి రేటు పదిశాతం కంటే ఎక్కువగా నమోదైనట్లైతే అక్కడ కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆయన సూచించారు. కంటైన్మెట్లు ఏర్పాటు చేయడంతోపాటు వ్యాక్సిన్ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని ఆయన లేఖలో సూచించారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.