కరోనా రికవరీ రేటులో ఈ రాష్ట్రాలే టాప్... తెలంగాణ, ఏపీ ఎక్కడున్నాయంటే..

కరోనా నుంచి కోలుకుంటున్న వారు ఎక్కువగా ఉన్న రాష్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాను కేంద్ర విడుదల చేసింది. మొత్తం 15 రాష్ట్రాల్లో రికవరీ రేటు మెరుగ్గా ఉన్నట్లు తెలిపింది.

news18-telugu
Updated: July 2, 2020, 7:46 PM IST
కరోనా రికవరీ రేటులో ఈ రాష్ట్రాలే టాప్... తెలంగాణ, ఏపీ ఎక్కడున్నాయంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు దాదాపు 20వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఓ వైపు ఇంత భారీ మొత్తంల కరోనా వేసులు వస్తున్నా.. మరోవైపు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మన దేశంలో రికవరీ రేటు దాదాపు 60శాతం ఉన్నట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. అందులోనూ కొన్ని రాష్ట్రాల్లో రికవరీ రేటు మెరుగ్గా ఉంది. కరోనా నుంచి కోలుకుంటున్న వారు ఎక్కువగా ఉన్న రాష్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాను కేంద్ర విడుదల చేసింది. మొత్తం 15 రాష్ట్రాల్లో రికవరీ రేటు మెరుగ్గా ఉన్నట్లు తెలిపింది. ఆ జాబితాను ఇక్కడ చూడండి.

రికవరీ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

1. చండీగఢ్ 82.3 శాతం
2. మేఘాలయా 80.8
3. రాజస్థాన్ 79.6
4. ఉత్తరాఖండ్ 78.6
5. చత్తీస్‌గఢ్ 78.36. త్రిపుర 78.3
7. బీహార్ 77.5
8. మిజోరాం 76.9
9. మధ్యప్రదేశ్ 76.9
10. ఝార్ఖండ్ 76.6
11. ఒడిశా 76.3
12. గుజరాత్ 72.3
13. హర్యానా 70.3
14. లద్దాఖ్ 70.1
15. ఉత్తర్ ప్రదేశ్ 69.1

ఐతే టాప్ 15 జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చోటు దక్కలేదు. ఏపీ, తెలంగాణలో రికవరీ రేటు ఇతర రాష్ట్రాలతో పోల్చితే కాస్త తక్కువగా ఉన్నట్లు దీన్ని బట్టి అర్ధమవుతోంది.


కాగా, భారత్‌లో గడిచిన 24 గంటల్లో 19,148 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో 434 మంది మరణించారు. మనదేశంలో ఇప్పటి వరకు 604,641 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 359,860 మంది కోలుకోగా.. 17,834 మంది మరణించారు. ప్రస్తుతం భారత్‌లో 17,834 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
First published: July 2, 2020, 7:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading