గుడ్ న్యూస్ ఇండియా.. కోలుకున్న 856 మంది కరోనా రోగులు..

ప్రతీకాత్మక చిత్రం

Corona Effect in India : స్వాంతన చేకూర్చే విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా బారి నుంచి 856 మంది రోగులు కోలుకున్నారని తెలిపింది.

  • Share this:
    Coronavirus India : కరోనాపై భారతావని పోరు అమోఘం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పటిష్ఠ చర్యలు, వైద్యుల చికిత్స, పారిశుధ్య కార్మికుల సేవలు, లాక్‌డౌన్ పాటిస్తూ ప్రజలు.. ఇలా కరోనాను అంతం చేసేందుకు ప్రతీ ఒక్కరు తమ వంతుగా కష్టపడుతున్నారు. ఈ కఠిన సమయాల్లో భారీ స్వాంతన చేకూర్చే విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా బారి నుంచి 856 మంది రోగులు కోలుకున్నారని తెలిపింది. వెబ్‌సైట్ ప్రకారం నిన్న సాయంత్రం 5 గంటలకు కోలుకున్న వారి సంఖ్య 764 ఉండగా, తాజాగా 856 మంది కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 7987 యాక్టివ్ కేసులు ఉండగా, మొత్తంగా 308 మంది చనిపోయారు. అటు.. ప్రపంచవ్యాప్తంగా 4,23,625 మంది కరోనా బంద విముక్తులయ్యారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: