కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్... ఎందుకంటే

Central Government Employees | ఏప్రిల్ వేతనం కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ తప్పేలా లేదు. కేంద్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడటమే కారణం.

news18-telugu
Updated: April 23, 2020, 10:13 AM IST
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్... ఎందుకంటే
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్... ఎందుకంటే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు షాక్ తప్పేలా లేదు. మార్చి 13న కేంద్ర కేబినెట్ డియర్నెస్ అలవెన్స్-DA ను 4 శాతం నుంచి 12 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీని వల్ల ఖజానాపై 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.14,510 భారం పడుతుందని అంచనా. ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు తగ్గిపోయాయి. దీంతో డీఏ అమలును ఆలస్యం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందన్న వార్తలొస్తున్నాయి. దీంతో 1.13 కోట్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇది బ్యాడ్ న్యూసే. డీఏలో మార్పులు 2020 జనవరి 1 నుంచి అమలులోకి రావాల్సి ఉంది. అంటే ఏప్రిల్ వేతనం సవరించిన డీఏ ప్రకారం రావాలి. దాంతో పాటు మూడు నెలల బకాయిలు కూడా చెల్లించాలి.

మార్చి 13న ఆమోదముద్ర వేసిన డీఏను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంకా నోటిఫై చేయలేదు. సాధారణ పరిస్థితుల్లో ఆర్థిక శాఖ ఈపాటికే నోటిఫై చేసేది. కానీ మార్చి 24 నుంచి లాక్‌డౌన్ కారణంగా పన్నులు తగ్గిపోవడం, నిధుల కొరత ఉండటంతో ప్రభుత్వం కాస్ట్ కటింగ్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే అన్ని శాఖలకు కేటాయించిన బడ్జెట్‌లో 40% కోత విధించింది. అంతేకాదు పీఎం కేర్స్ ఫండ్‌కు ఉద్యోగులందరూ ఏప్రిల్‌లో ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. పెరిగిన డీఏ అమలులోకి వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నిరాశే మిగిలే అవకాశముంది.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: పసిడిప్రియులకు షాక్... అక్షయ తృతీయకు ముందు భారీగా పెరిగిన బంగారం ధర

Prepaid Plans: రోజూ 1.5 జీబీ డేటా... జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్ ఇవే

Akshay Tritiya 2020: ఆన్‌లైన్‌లో బంగారంపై అక్షయ తృతీయ ఆఫర్స్ ఇవే
First published: April 23, 2020, 10:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading