ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చిన కేంద్రం... జూలై వరకు డీఏ లేదని ప్రకటన

ఏప్రిల్ వేతనం సవరించిన డీఏ ప్రకారం రావాలి. దాంతో పాటు మూడు నెలల బకాయిలు కూడా చెల్లించాలి. కానీ డీఏను జూలై 1 నుంచి అమలు చేస్తామని కేంద్రం తాజాగా ప్రకటించింది. జనవరి నుంచి జూన్ వరకు కొత్త డీఏ వర్తించదు.

news18-telugu
Updated: April 23, 2020, 2:26 PM IST
ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చిన కేంద్రం... జూలై వరకు డీఏ లేదని ప్రకటన
ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చిన కేంద్రం... జూలై వరకు డీఏ లేదని ప్రకటన (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం షాకిచ్చింది. 2020 జనవరి నుంచి చెల్లించాల్సిన డియర్నెస్ అలవెన్స్-DA నిలిపివేస్తున్నట్టు అదికారికంగా ప్రకటించింది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఖజానాపై భారం పడటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటుందన్న వార్తలొచ్చాయి. ఇప్పుడా వార్తలు నిజమయ్యాయి. 2020 జనవరి 1 నుంచి చెల్లించాల్సి ఉన్న డీఏ బకాయిలను నిలిపివేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. "కోవిడ్ 19 సంక్షోభం కారణంగా 2020 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డియర్నెస్ అలవెన్స్, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు చెల్లించాల్సిన డియర్నెస్ రిలీఫ్ నిలిపివేస్తున్నాం. 2020 జూలై 1 నుంచి డీఏ, డీఆర్ చెల్లిస్తాం" అని కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన ఖర్చుల విభాగం నోటిఫికేషన్ విడుదల చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త డీఏ 2020 జూలై 1 నుంచి వర్తిస్తుంది. 2020 జనవరి 1 నుంచి 2020 జూన్ 30 వరకు ఎలాంటి బకాయిలు చెల్లించదు కేంద్రం.

మార్చి 13న కేంద్ర కేబినెట్ డియర్నెస్ అలవెన్స్-DA ను 4 శాతం నుంచి 12 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీని వల్ల ఖజానాపై 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.14,510 భారం పడుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు తగ్గిపోయాయి. దీంతో డీఏ అమలును నిలిపివేసింది కేంద్రం. ఈ నిర్ణయం 1.13 కోట్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నిరాశ మిగిల్చింది. వాస్తవానికి డీఏలో మార్పులు 2020 జనవరి 1 నుంచి అమలులోకి రావాలి. అంటే ఏప్రిల్ వేతనం సవరించిన డీఏ ప్రకారం రావాలి. దాంతో పాటు మూడు నెలల బకాయిలు కూడా చెల్లించాలి. కానీ డీఏను జూలై 1 నుంచి అమలు చేస్తామని కేంద్రం తాజాగా ప్రకటించింది. జనవరి నుంచి జూన్ వరకు కొత్త డీఏ వర్తించదు.

ఇవి కూడా చదవండి:

EPF: రూ.15,000 లోపు జీతం ఉన్నవారికి త్వరలో గుడ్ న్యూస్?

JioPOS Lite App: ఈ జియో యాప్‌తో డబ్బు సంపాదించండి ఇలా

LIC Policy: రోజుకు రూ.28 పొదుపు... చేతికి రూ.3.97 లక్షలు... ఆధార్ కార్డ్ ఉన్నవారికి మాత్రమే
First published: April 23, 2020, 2:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading