Work From Home: డిసెంబర్ 31 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్... ప్రకటించిన కేంద్రం

Work From Home | వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని 2020 డిసెంబర్ 31 వరకు పొడిగించింది.

news18-telugu
Updated: July 22, 2020, 12:43 PM IST
Work From Home: డిసెంబర్ 31 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్... ప్రకటించిన కేంద్రం
Work From Home: డిసెంబర్ 31 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్... ప్రకటించిన కేంద్రం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కేంద్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటును డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఐటీ, బీపీఓ కంపెనీలు డిసెంబర్ 31 వరకు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇవ్వొచ్చు. భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మొదట ఏప్రిల్ 30 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించింది. కోవిడ్ 19 వ్యాప్తి పెరగడంతో జూలై 31 వరకు గడువు పొడిగించింది. ఇప్పుడు కూడా వైరస్ సంక్షోభం ఇంకా కొనసాగుతుండటంతో డిసెంబర్ 31 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగిస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్-DoT ట్వీట్ చేసింది. "ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఉండటంతో వర్క్ ఫ్రమ్ హోమ్ సులభతరం చేసేందుకు సర్వీస్ ప్రొవైడర్ల నియమనిబంధనల్లో ఇచ్చిన సడలింపుల్ని 2020 డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నాం" అని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్ ప్రకటించింది.

Work From Home: ఈ గ్యాడ్జెట్స్, యాప్స్ ఉంటే మీ ఇల్లే ఆఫీస్‌గా మారిపోతుంది

Work From Home: మీ కంప్యూటర్‌పై కరోనా వైరస్ ఉండొచ్చు... క్లీన్ చేయండిలా

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్-DoT నిర్ణయాన్ని ఐటీ కంపెనీలు స్వాగతించాయి. ప్రస్తుతం 85 నుంచి 90 శాతం మంది ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కీలకమైన బాధ్యతలు ఉన్నవారే ఆఫీసులకు వెళ్తున్నారు. 2025 నాటికి తమ ఉద్యోగుల్లో కేవలం 25 శాతం మంది మాత్రమే ఆఫీసుల్లో పనిచేస్తారని ఇప్పటికే టీసీఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగతా కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 12 లక్షలకు చేరువవుతోంది. గత 24 గంటల్లో 37724 కేసులు నమోదవగా 648 మంది చనిపోయారు. ఇప్పటివరకు మొత్తం 11,92,915 కేసులు నమోదు కాగా 27,732 మంది చనిపోయారు. 7,53,047 మంది రికవర్ అయ్యారు. ప్రస్తుతం 4,11,133 యాక్టీవ్ కేసులున్నాయి.
Published by: Santhosh Kumar S
First published: July 22, 2020, 12:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading