Good News: మరో మూడు నెలలు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు

Pradhan Mantri Garib Kalyan Yojana | ఉజ్వల పథకంలో ఉన్నవారికి ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉచితంగా సిలిండర్లు లభించాయి. జూన్‌తో ఈ పథకం ముగిసింది.

news18-telugu
Updated: July 8, 2020, 6:25 PM IST
Good News: మరో మూడు నెలలు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన-PMGKY పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సహాయక చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఉజ్వల పథకంలో ఉన్న 8 కోట్ల కుటుంబాలకు మూడు నెలల పాటు ఉచితంగా సిలిండర్లు ఇస్తామని తెలిపారు. వారికి ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉచితంగా సిలిండర్లు లభించాయి. జూన్‌తో ఈ పథకం ముగిసింది. అయితే కరోనా వైరస్ సంక్షోభం ఇంకా కొనసాగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను పొడిగించింది. మరో మూడు నెలలు ఉచితంగా సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. ఉచిత సిలిండర్ల పథకాన్ని సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు.


ఉజ్వల పథకం లబ్ధిదారులకు సాయాన్ని పొడిగించడంతో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో కూడా మూడు సిలిండర్లు ఉచితంగా లభించనున్నాయి.
Published by: Santhosh Kumar S
First published: July 8, 2020, 6:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading