మోదీ సర్కారు కీలక నిర్ణయం.. అంతా కరోనా ఎఫెక్టే..

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా దెబ్బకు దేశ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుండటంతో ఇప్పటికే ఎంపీల జీతభత్యాల్లో కోత విధించగా, ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది.

news18-telugu
Updated: April 10, 2020, 8:21 AM IST
మోదీ సర్కారు కీలక నిర్ణయం.. అంతా కరోనా ఎఫెక్టే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా దెబ్బకు దేశ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుండటంతో ఇప్పటికే ఎంపీల జీతభత్యాల్లో కోత విధించగా, ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయించిన నిధుల్లో 15 - 20 శాతం వరకు ఖర్చుపై నియంత్రణ విధించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం మెమొరాండం జారీ చేసింది. మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ఇతర సంస్థలను 3 కేటరిగీలుగా విభజించిన ఆర్థిక శాఖ.. ఏ-కేటరిగి పేర్కొన్న 18 శాఖలు, విభాగాలు పూర్తి స్థాయి నిధులను వినియోగించుకునే వెసులుబాటును కల్పించింది. బీ-కేటగిరిలో చేర్చిన 33 శాఖలకు 20 శాతం, సీ-కేటగిరిలో చేర్చిన 50కి పైగా శాఖలకు 15 శాతం నియంత్రణ విధించింది.

ఈ ఉత్తర్వులు.. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి అమల్లో ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో రాబడిపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. పౌరవిమానయాన శాఖ, ఫార్మాసూటికల్‌, ఆరోగ్య శాఖ, ఆయూష్‌ శాఖ, వినియోగదారుల వ్యవహారాలు, గ్రామీణాభివద్ధి, రైల్వే విభాగంతో పాటు రాష్ట్రాలకు కేంద్ర నిధుల బదిలీ, సుప్రీం కోర్టు, సీవీసీ, యూపీఎస్సీ, రాష్ట్రపతి భవన్‌లు మొత్తం నిధులను వాడుకునే వెసులుబాటు కల్పించింది ఆర్థిక శాఖ.
First published: April 10, 2020, 8:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading