Lock Down | లాక్‌డౌన్ చేసేయండి .. అన్ని రాష్ట్రాలకు కేంద్రం తాజా ఆదేశం.. అతిక్రమిస్తే చర్యలే..

కరోనా వైరస్ దేశంలో ఊహించనంత వేగంగా విస్తరిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. కొద్దిసేపటి క్రితమే రాష్ట్రాలకు కీలక ఆదేశాలిచ్చింది.

news18-telugu
Updated: March 23, 2020, 11:05 AM IST
Lock Down | లాక్‌డౌన్ చేసేయండి .. అన్ని రాష్ట్రాలకు కేంద్రం తాజా ఆదేశం.. అతిక్రమిస్తే చర్యలే..
నిన్నటి వరకు మొత్తం 7,70,764 టెస్టులు చేశారు.
  • Share this:
కరోనా వైరస్ దేశంలో ఊహించనంత వేగంగా విస్తరిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. కొద్దిసేపటి క్రితమే రాష్ట్రాలకు కీలక ఆదేశాలిచ్చింది. రాష్ట్రాలన్నీ లాక్‌డౌన్ చేయాలని ఆదేశించింది. వెంటనే చర్యలకు దిగాలని తెలిపింది. కాదని ఎవరైనా బయట తిరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 75 జిల్లాల్లోనే లాక్‌డౌన్ ప్రకటించగా, తాజాగా.. దేశంలోని అన్ని రాష్ట్రాలను లాక్‌ డౌన్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కాగా, దేశంలో ఇప్పటి వరకు 416 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు.. కరీంనగర్‌లో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రబోధకులతో కలిసి తిరిగిన వ్యక్తికి కరోనా వచ్చినట్లు తేలింది. అతడ్ని అధికారులు కరీంనగర్‌ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇదిలా ఉండగా, మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో దేశంలొో మృతుల సంఖ్య 2 శాతంగా ఉంది. అంటే... ఇది దాదాపు చైనాకు సమానం అనుకోవచ్చు. అదే ఇటలీలో ఇది 13 శాతంగా ఉంది. ఇటలీతో పోల్చితే... భారత్ మృతుల సంఖ్య పెరగకుండా అత్యంత సమర్థంగా పనిచేస్తోందని చెప్పుకోవచ్చు. ఐతే, ఇండియాలో మహారాష్ట్ర 74 కేసులతో టాప్‌లో ఉంది. తర్వాత కేరళ 67 కేసులతో రెండో స్థానంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో వైరస్ మూడో దశకు చేరినట్లే అంటున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు
First published: March 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading