హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Corona Ex-gratia: కరోనా మృతుల కుటుంబాలకు ఊరట.. ఇలా అప్లై చేసుకుంటే రూ.50వేలు.. త్వరలోనే అమలు..

Corona Ex-gratia: కరోనా మృతుల కుటుంబాలకు ఊరట.. ఇలా అప్లై చేసుకుంటే రూ.50వేలు.. త్వరలోనే అమలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర ప్రభుత్వం (Central Government) కొవిడ్ మృతుల (Covid Deaths) కుటుంబాలకు రూ.50వేల పరిహారం చెల్లించాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (National Desaster Management) కు సిఫార్లు చేసినట్లు సుప్రీం కోర్టుకు (Supreme Court) తెలిపింది. ఈ పరిహారాన్ని స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫండ్ (State Disaster Management) నుంచి చెల్లించాలని పేర్కొంది.

ఇంకా చదవండి ...

  ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్  (Corona Virus)సృష్టిస్తున్న విలయం అందరికీ తెలిసిందే. కోట్లాది మందికి వ్యాపించిన ఈ మహమ్మారి లక్షలాది మందిని బలి తీసుకుంది. భారత్ (India)లో కూడా దాదాపు 4.5 లక్షల మంది వైరస్ కు బలయ్యారు. కొవిడ్ కు బలైన కుటుంబాల్లో ధనికుల నుంచి పేదవాళ్ల వరకు అందరూ ఉన్నారు. ఈ మహమ్మారి కారణంగా వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీంతో కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్న డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారం చెల్లించాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు సిఫార్లు చేసినట్లు సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ పరిహారాన్ని స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫండ్ నుంచి చెల్లించాలని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం అందనుంది.

  ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..

  సాధారణంగా కరోనా సోకి మరణించిన వారితో పాటు కరోనా నివారణా చర్యల్లో పాల్గొని వైరస్ కు బలైన వారి కుటుంబాలకు కూడా ఈ పరిహారం వర్తిస్తుంది. దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు (Corona Death Certificate) కేంద్ర ఆరోగ్య శాఖ, భారత వైద్య పరిశోధన మండలి (ICMR) మార్గదర్శకాల ప్రకారం ధృవీకరణ పత్రాలు ఇస్తారని తెలిపిన కేంద్రం.. ఈ సర్టిఫికెట్లు పొందిన వారికే పరిహారం వర్తిస్తుందని స్పష్టంచేసింది. గతంలోనే కాకుండా రాబాయో రోజుల్లో కొవిడ్ తో మరణించిన వారికి కూడా పరిహారం చెల్లించాలని కేంద్రం పేర్కొంది.

  ఇది చదవండి: గుడివాడ సెంటర్లో తేల్చుకుందాం..! కొడాలి నానికి వంగవీటి రాధ సవాల్..? ప్రచారంలో నిజమెంత..?


  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విషయానికి వస్తే 14,097 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటిచింది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం వీరందరికీ రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు నమోదైన మృతులను బట్టి చూస్తే మొత్తం రూ.70,48,50,000 చెల్లించాల్సి ఉంటుంది. ఐతే వీరందరికీ పరిహారం చెల్లిస్తారా..? లేక ఐసీఎంఆర్ సర్టిఫికెట్ ఉన్నవారికి మాత్రమే చెల్లిస్తారా..? అనేడి చూడాల్సి ఉంది.

  ఇది చదవండి: అగ్రవర్ణపేదలకు సువర్ణావకాశం.. ఈ అర్హతలుంటే రూ.15వేలు.. ఇలా అప్లై చేసుకోండి..


  కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ..

  కొవిడ్ మృతుల కుటుంబాలు పరిహారానికి సంబంధించిన పత్రాలన్నీ సమర్పించిన తర్వాత 30 రోజుల లోపు వారికి సొమ్ము అందాల్సి ఉంటుంది. బాధిత కుటుంబాలు రాష్ట్రప్రభుత్వం రూపొందించిన దరఖాస్తు నింపి.. దానికి కొవిడ్ తో మరణించినట్లు ధృవీకరణ పత్రం, ఆధార్, నామినీతో పాటు ఇతర వివారలను జతపరిచి అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. జిల్లాస్థాయి అధికారులు వాటిని తనిఖీ చేసి కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీకి పంపుతారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్, వైద్యఆరోగ్య శాక అధికారి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, మరో నిపుణుడు సభ్యులుగా ఉంటారు. దరఖాస్తు చేసుకున్న కుటుంబానికి పరిహారం చెల్లించాలా..? వద్దా..? అనేది సిఫార్సు చేస్తుంది. అలాగే దరఖాస్తును తిరస్కరిస్తే గనుక ఎందుకు తిరస్కరించాల్సి వస్తుందో కారణం తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Corona deaths

  ఉత్తమ కథలు