Coronavirus: విరాళాలు ఇస్తున్నారా? ఈ హెచ్చరిక మీకోసమే

PM CARES Fund | మీరు కూడా ప్రధాన మంత్రి సహాయ నిధి పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళాలు ఇస్తున్నారా? అయితే జాగ్రత్త.

news18-telugu
Updated: March 30, 2020, 6:28 PM IST
Coronavirus: విరాళాలు ఇస్తున్నారా? ఈ హెచ్చరిక మీకోసమే
Coronavirus: విరాళాలు ఇస్తున్నారా? ఈ హెచ్చరిక మీకోసమే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనావైరస్ సృష్టించిన సంక్షోభం అంతాఇంతా కాదు. కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ స్థాయిలో చర్యలు చేపట్టాయి. ఓవైపు కరోనా బాధితులకు వైద్య సదుపాయాలు అందిస్తూ, కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారిని ఆదుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధితో పాటు ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళాలు అందిస్తున్నవారెందరో ఉన్నారు. మరి మీరు కూడా ప్రధాన మంత్రి సహాయ నిధి పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళాలు ఇస్తున్నారా? అయితే జాగ్రత్త. పీఎం కేర్స్ ఫండ్ పేరుతో నకిలీ యూపీఐ ఐడీ సృష్టించినట్టు బయటపడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI, కేంద్ర ప్రభుత్వం విరాళాలు ఇచ్చేవారిని హెచ్చరిస్తున్నాయి.


మీరు యూపీఐ ద్వారా పీఎం కేర్స్‌కు విరాళాలు ఇవ్వాలనుకుంటే ఓసారి యూపీఐ ఐడీ చెక్ చేయండి. విరాళాల సేకరణ కోసం క్రియేట్ చేసిన పీఎం కేర్స్ ఫండ్ యూపీఐ pmcares@sbi అని ఉంటుంది. మీరు విరాళాలు ఇచ్చేముందు ఇదే యూపీఐ ఐడీ ఉందో లేదో చెక్ చేయండి. యూపీఐ ఐడీ తప్పుగా ఉన్నట్టైతే పేమెంట్ చేయొద్దు. మీకు ఏదైనా తేడా అనిపిస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ చేయండి. ఇప్పటికే అనేక మంది ఈ కంప్లైంట్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:Train Hospital: రైలు బోగీనే ఆస్పత్రిగా మార్చిన ఇండియన్ రైల్వేస్

EPF Account: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి హెచ్చరిక... ఈ విషయాలు మర్చిపోవద్దు

Samsung Galaxy M11: భారీ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరాతో సాంసంగ్ గెలాక్సీ ఎం11
Published by: Santhosh Kumar S
First published: March 30, 2020, 6:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading