Corona Treatment: కరోనాకు కొత్త వైద్యం .. కేంద్రం అనుమతి

Corona Treatment: కరోనా చికిత్సకు ఆయుర్వేద వైద్యులు చికిత్స అందించేందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఎలాంటి లక్షణాలు లేని కోవిడ్19 రోగులకు, తేలికపాటి లక్షణాలతో పాజిటివ్ నిర్ధారణ అయిన వారికి ఆయుర్వేద వైద్యులు మందులు ఇవ్వొచ్చు.


Updated: October 7, 2020, 8:26 PM IST
Corona Treatment: కరోనాకు కొత్త వైద్యం .. కేంద్రం అనుమతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా చికిత్సకు ఆయుర్వేద వైద్యులు చికిత్స అందించేందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఎలాంటి లక్షణాలు లేని కోవిడ్19 రోగులకు, తేలికపాటి లక్షణాలతో పాజిటివ్ నిర్ధారణ అయిన వారికి ఆయుర్వేద వైద్యులు మందులు ఇవ్వొచ్చు. ఆయుర్వేద వైద్యానికి సంబంధించి కొత్త క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ విడుదల చేశాయి. కరోనా సోకిన వారిలో రోగనిరోధక శక్తి పెంచేందుకు, వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు సంప్రదాయ ఆయుర్వేద వైద్యులు తమ వంతు కృషి చేయనున్నారు.

రోగనిరోధక శక్తే కీలకం

రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారికి కరోనా సోకినా దాని ప్రభావం అంతగా ఉండదు. సాంప్రదాయ ఆయుర్వేద వైద్య పద్ధతి ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి భారత ప్రభుత్వం మార్గదర్శకాల జాబితాను విడుదల చేసింది. దీనికోసం ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ నేచురోపతి, ఇతర జాతీయ పరిశోధనా సంస్థల నిపుణులతో ఒక కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు ఇచ్చిన సలహాలు, సూచనలతో ఈ ప్రోటోకాల్ ను రూపొందించారు. తేలికపాటి కరోనాను నివారించేలా మార్గదర్శకాలు తయారు చేశారు.

ప్రోటోకాల్లో ఏముంది?
సామాజిక దూరం పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడంతో పాటు శ్వాస వ్యవస్థను మెరుగు పరచడానికి వేడి నీటిలో ఉప్పు, పసుపు కలిపి పుక్కిలించడం... వంటి సూచనలు మార్గదర్శకాల్లో ఉన్నాయి. పుక్కిలించడానికి త్రిఫల చూర్ణం, యష్టి మధు చూర్ణాలను వాడవచ్చు. ఔషధ నూనె, ఆవు నెయ్యి, కొబ్బరి నూనె చుక్కలను ముక్కులో వేసుకుంటే ప్రతిఫలం ఉంటుంది. వాము, యూకలిప్టస్ నూనెతో ఆవిరి పట్టాలి. శారీరక శ్రమ, కనీసం ఆరు గంటల నిద్ర, యోగా వంటివి దినచర్యలో భాగం చేసుకోవాలి. అల్లం, కొత్తిమీర, తులసి, జీలకర్ర వంటి వాటిని నీటిలో ఉడికించి, ఆ నీరు తాగాలి. పసుపు పాలు, ఆయుష్ కద, క్వాత్ వంటివి క్రమం తప్పకుండా తీసుకోవాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి. కోవిడ్ బారిన పడకుండా ఉండటానికి అశ్వగంధ తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

ఎలాంటి మందులు వాడాలి?
లక్షణాలు లేని కరోనా రోగులకు గుడుచి ఘనావటి, సంషమణి వటి లేదా గిలోయ్ వటి, టినోస్పోరా కార్డిఫోలియా ఐపీ చూర్ణం లేదా టినోస్పోరా చూర్ణం వంటివి సిఫారసు చేయవచ్చు. గుడుచి, పిప్పాలి తీసుకున్న వారిలో కోవిడ్ రికవరీ రేటు మెరుగ్గా ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది. తేలికపాటి లక్షణాలతో COVID-19 నిర్ధారణ అయిన వారు ఆయుష్ 64 ను ఉపయోగించవచ్చు. ఈ మందులను రిజిస్టర్డ్ ఆయుర్వేద వైద్యుల సూచనలతోనే వాడాలని ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నాయి.



పరిశోధనలు..

ఇంటర్-డిసిప్లినరీ ఆయుష్ ఆర్ అండ్ డి టాస్క్ ఫోర్స్ గురించి కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ గతంలో పార్లమెంటులో ప్రస్తావించారు. ఇందులో భాగంగా ఆయుష్ రోగనిరోధక అధ్యయనాల కోసం క్లినికల్ రీసెర్చ్ ప్రోటోకాల్స్‌ను రూపొందించామని చెప్పారు. కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందుల గురించి పరిశోధనలు చేయించామన్నారు. రోగనిరోధక శక్తి పెంచడానికి, చికిత్స కోసం ఆయుష్-సిఎస్ఐఆర్ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తున్నామని మంత్రి పార్లమెంటుకు తెలిపారు. ఎక్కువ జనాభా ఉండే కంటైనర్ జోన్లలో ఆయుష్ మందులతో రోగనిరోధకతపై ఆయుష్ రీసెర్చ్ కౌన్సిల్స్, ఇతర ప్రభుత్వ సంస్థలతో కలిసి పెద్ద ఎత్తున అధ్యయనం చేశామని మంత్రి వివరించారు.
Published by: Nikhil Kumar S
First published: October 7, 2020, 8:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading