కరోనా(Corona) ముగిసిపోయిందని అందరూ భావిస్తున్న సమయంలో.. మళ్లీ కలవరం మొదలైంది. చైనా(China)లో వేగంగా కేసులు పెరుగుతుండటమే ఇందుకు కారణం. అక్కడ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు (Positive cases)నమోదు అవుతున్నాయి. కొన్ని నెలల్లో అక్కడ పరిస్థితి మరింత దారుణంగా మారవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో ఇండియా(India)లో కూడా కేసులు పెరిగే అవకాశం ఉందని కేంద్రం అన్ని రాష్ట్రాలకు అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో కరోనాకు సంబంధించి XBB వేరియంట్(XBB variant) గురించి ఓ పోస్ట్(Post) సోషల్ మీడియా(Social media)లో వైరల్(Viral)గా మారింది.
నకిలీదని స్పష్టం చేసిన కేంద్రం..
కరోనా XBB వేరియంట్ గురించి వాట్సాప్‌లోని కొన్ని గ్రూప్‌ల్లో ఓ మేసేజ్ ఫార్వార్డ్ అవుతోంది. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. వాట్సాప్‌లో వైరల్ అవుతున్న కరోనా XBB వేరియంట్ పోస్ట్ నకిలీదని స్పష్టం చేసింది. ఈ మేరకు చేసిన ఓ ట్వీట్‌లో.. కరోనా XBB వేరియంట్‌కు సంబంధించిన మెసేజ్ కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యూలేట్ అవుతోందని పేర్కొంది. అది ఫేక్ మెసేజ్ అని, అందులోని వివరాలు వాస్తవం కాదని, ప్రజలను తప్పుదారి పట్టించేదిలా ఉందని తెలిపింది.
#FakeNews This message is circulating in some Whatsapp groups regarding XBB variant of #COVID19. The message is #FAKE and #MISLEADING. pic.twitter.com/LAgnaZjCCi
— Ministry of Health (@MoHFW_INDIA) December 22, 2022
ప్రాణాంతకం.. ఐదు రెట్లు అధికంగా మరణాలు?
వాట్సాప్‌లో వైరల్ అవుతున్న మెసేజ్‌లో కొత్త XBB వేరియంట్ ప్రాణాంతకమైందని, దీన్ని త్వరగా గుర్తించడం కష్టమని ఉంది. అంతేకాకుండా ఈ వేరియంట్ లక్షణాలుగా దగ్గు, జ్వరం ఉండవని, కీళ్ల నొప్పులు, తలనొప్పి, మెడలో నొప్పి, న్యుమోనియా, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని మెసేజ్‌లో ఉంది. ఒమిక్రాన్ XBB వేరియంట్ ఐదు రెట్లు అధికంగా మరణాల రేటును కలిగి ఉంటుందని పేర్కొంది. XBB వేరియంట్ సోకితే లక్షణాలు బయటకు కనబడవని, అయితే అతి తక్కువ సమయంలో తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ ఫేక్ మెసేజ్‌లో ఉంది. స్ట్రెయిన్ నేరుగా ఊపిరితిత్తులను స్వల్పకాలంలోనే దెబ్బతిస్తుందని, అంతేకాకుండా నాసోఫారింజియల్ టస్ట్ ద్వారా ఈ వేరియంట్ బయటపడదని కూడా ఆ మెసేజ్‌లో ఉంది. ఈ వేరియంట్ సోకిన చాలా మందికి ఎలాంటి నొప్పులు లేవని, అయితే X-Rayల్లో తేలికపాటి చెస్ట్ న్యుమోనియాను చూపించిందని ఫేక్ మెసేజ్‌లో పేర్కొన్నారు. అయితే ఈ మెసేజ్ నకిలీదని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది.
అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం
ఇది ఇలా ఉంటే .. చైనాను అతలాకుతలం చేస్తున్న కొవిడ్ 19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ BF.7 స్ట్రెయిన్ కేసులు ఇండియాలోనూ బయటపడ్డాయి. ఆరు నెలల కాలంలో నాలుగు Omicron BF.7 స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో ఇద్దరికి, ఒడిశాలో ఒకరికి ఈ వేరియంట్ వైరస్ సోకింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అలర్ట్ జారీ చేసింది. రద్దీ ప్రదేశాల్లో అందరూ మాస్కులు ధరించాలని సూచించింది. బూస్టర్ డోస్ ప్రక్రియను చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక అన్ని ఎయిర్‌పోర్ట్‌లలో హై అలర్ట్ జారీ చేసింది. విదేశాల నుంచే ప్రయాణికులకు కరోనా టెస్ట్‌లను తప్పనిసరి చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.