కరోనా వేళ.. ఆరాటం ఆపుకోలేని పెళ్లి కొడుకు.. చివరకు ఎంత పని అయ్యిందంటే..

నిబంధనలను ఉల్లంఘించిన వారిపై జరిమానాలతో పాటు కేసులు నమోదు చేసిన ఘటనలు ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు ఎంత మొత్తుకుంటున్నా.. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాకు చెందిన ఓ యువకుడు మాత్రం పెళ్లి పట్ల తన ఆరాటాన్ని ఆపుకోలేకపోయాడు.

news18-telugu
Updated: June 19, 2020, 1:39 PM IST
కరోనా వేళ.. ఆరాటం ఆపుకోలేని పెళ్లి కొడుకు.. చివరకు ఎంత పని అయ్యిందంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజూకీ పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. దీంతో జనజీవనం స్థంభించిపోయింది. దాదాపు మూడు నెలల అనంతరం లాక్‌డౌన్ నిబంధనల్లో కొంత సడలింపు ఇచ్చారు. అయితే వివాహాలు, శుభకార్యాలు, జనసమూహం గుమిగూడే ఏ కార్యక్రమాన్ని నిర్వహించొద్దని ప్రభుత్వాలు సూచించాయి. ఆ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై జరిమానాలతో పాటు కేసులు నమోదు చేసిన ఘటనలు ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు ఎంత మొత్తుకుంటున్నా.. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాకు చెందిన ఓ యువకుడు మాత్రం పెళ్లి పట్ల తన ఆరాటాన్ని ఆపుకోలేకపోయాడు. ఆ యువకుడికి కరోనా అనుమానిత లక్షణాలు కన్పించడంతో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం శాంపిల్స్‌ను ఇచ్చాడు.

ఫలితాలు వచ్చేవరకు ఆగకుండా ఈ లోపే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లికి వంద మందిని పిలిచి కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ నిబంధనలు పాటించకుండా పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి తంతు ముగిసిందో లేదో.. పెళ్లి కొడుక్కి కరోనా వైరస్ ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు ఆ పెళ్లి కొడుకును వైద్య సిబ్బంది, అధికారులు ఆస్పత్రికి తరలించారు. నిబంధనలను పక్కనబెట్టి పెళ్లి చేసుకున్నందుకు పోలీసులు ఆ పెళ్లి కొడుకుపై కేసు నమోదు చేశారు.

First published: June 19, 2020, 1:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading