కరోనా రూల్స్ బ్రేక్.. ఏకంగా దేశాధ్యక్షుడిపైనే కేసు.. ఎక్కడంటే..

ప్రతీకాత్మ కచిత్రం

చట్టం ముందు అందరూ సమానమేనని.. ఆరోగ్య భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రోత్సహించేలా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడంతో కేసు నమోదు చేశామని ఆ రాష్ట్ర గవర్నర్‌ స్పష్టంచేశారు.

 • Share this:
  సాధారణంగా చట్టం ముందు అంతా సమానమే అనే పదం మనం చాలాసార్లు వింటుంటాం. కానీ ఇది అధికారంలోకి ఉన్న బడా నేతలకు, పలుకుబడి ఉన్న నాయకులకు పెద్దగా వర్తించదు. ఎందుకుంటే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి ఎవరూ పెద్దగా సాహసించరు. అయితే కరోనా రూల్స్ బ్రేక్ చేసినందుకు ఏకంగా దేశ అధ్యక్షుడిపైనే కేసు నమోదు చేసిన ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. కరోనా విజృంభణ సమయంలోనూ బ్రెజిల్‌ అధ్యక్షుడు కోవిడ్‌ రూల్స్‌ పాటించలేదు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. బ్రెజిల్‌లోని మారన్‌హవో రాష్ట్రంలో కరోనా వైరస్‌ కట్టడి కోసం వందమందికిపైగా పాల్గొనే సమావేశాల జరపకూడదని నిషేధం ఉంది.

  వీటితో పాటు మాస్క్‌ ధరించని వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మారన్‌హవో రాజధాని సావో లూయిస్‌ నగరంలో జరిగిన ఆస్తి పట్టాల పంపిణీ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో మాస్క్‌ కూడా ధరించలేదు. ఆ ప్రాంతంలో ఉన్న కోవిడ్‌ ఆంక్షలను ఉల్లంఘించినందుకు అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారోపై అధికారులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

  చట్టం ముందు అందరూ సమానమేనని.. ఆరోగ్య భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రోత్సహించేలా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడంతో కేసు నమోదు చేశామని ఆ రాష్ట్ర గవర్నర్‌ స్పష్టంచేశారు. అయితే అధ్యక్షుడిపై కేసు నమోదు చేసినప్పటికీ.. దీనిపై అప్పీలుకు వెళ్లేందుకు 15రోజుల సమయం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా.. కరోనా రూల్స్ పాటించనందుకు ఓ దేశ అధ్యక్షుడిపైనే కేసు నమోదు చేయడం విశేషమే.
  Published by:Kishore Akkaladevi
  First published: