Mask: మాస్కు వాడుతున్నారా.. ? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Mask: కరోనా వైరస్ కారణంగా మాస్క్ లేనిదే బయటకు రాలేని పరిస్థితి. అయితే, అతి ఏదైనా ప్రమాదమే. అందువల్లే మాస్కును కూడా అతిగా వాడడం మూలన ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

news18-telugu
Updated: October 5, 2020, 5:13 PM IST
Mask: మాస్కు వాడుతున్నారా.. ? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కోవిడ్–19 సంక్షోభం మనిషి జీవనశైలిలో అనేక మార్పులను తీసుకొచ్చింది. వాటిలో ఫేస్ మాస్క్‌ల వాడకం ఒకటి. కరోనా వైరస్ కారణంగా మాస్క్ లేనిదే బయటకు రాలేని పరిస్థితి. అయితే, అతి ఏదైనా ప్రమాదమే. అందువల్లే మాస్కును కూడా అతిగా వాడడం మూలన ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నిరంతరం మాస్క్ ధరించడం వల్ల చర్మంపై ఎర్రటి దద్దుర్లు, ఇతర చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇది మహిళల్లో కంటే పురుషుల్లో ఎక్కువ సమస్యలును తెచ్చిపెడుతుంది. ఎందుకంటే పురుషులకు గడ్డం ఉండటం వల్ల మాస్క్ ధరించే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి.

మాస్క్ కింద ఉండే గడ్డం చాలా గజిబిజిగా ఉండంటం మూలాన వారికి చికాకు కలిగించడమే కాక మరిన్ని కొత్త సమస్యలకు వచ్చే అవకాశం ఉంటుంది. గడ్డం ఎక్కువగా ఉండటం మూలాన సూక్ష్మక్రిముల మీ ముక్కు మరియు నోటిలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, సూక్ష్మక్రిములు మీ శరీరంలోకి రాకుండా ఉండటానికి మీ గడ్డాన్ని ఎల్లప్పుడూ చిన్నగా ఉంచుకొండి. అంతేకాక మీ గడ్డం సైజును బట్టి మాస్కును ఎంచుకోండి. మాస్క్ నుంచి మీ గడ్డాన్ని రక్షించడానికి డెర్మాప్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ లలిత ఆర్య కొన్ని చిట్కాలను పేర్కొంది. వాటిని పరిళీలిద్దాం.

1. మీ గడ్డం పొడవుగా, దట్టంగా ఉంటే మీ ముఖం కడుక్కున్న తర్వాత, స్నానం చేసిన తర్వాత మీ గడ్డాన్ని సరిగా తుడుచుకోండి. లేదంటే మీ గడ్డంపై ఉన్న నీటి బిందువులు అలాగే ఉండిపోతాయి. తద్వారా మాస్క్ ధరించినప్పుడు వచ్చే చర్మం దురదగా మారి చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాక, ఇది గడ్డం యొక్క చుండ్రు సమస్యలకు కూడా కారణమవుతుంది.

2 . ఎల్లప్పుడూ మీ మాస్కును శుభ్రం చేసి ధరించండి. లేదంటే ఇది ముఖంపై మొటిమలు మరియు దద్దుర్లను కలిగిస్తుంది. మాస్క్ ధరించే ముందు మీ గడ్డం శుభ్రం చేసి దానిపై ఎస్పీఎఫ్ లోషన్ను అప్లై చేయండి.

3. వేడి మరియు తేమతో కూడిన వాతావరణంలో మీ మాస్కును ధరించే ముందు మీ ముఖంపై నూనె రాసుకోవడాన్ని మానేయండి. ఎందుకంటే మాస్క్ ధరించే సమయంలో ఇది జిడ్డును, అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

4. మనలో చాలామందికి చేతితో అదేపనిగా గడ్డాన్ని తాకే అలవాటు ఉంటుంది. ఈ అలవాటను మానుకోవడం మంచింది. ఎందుకంటే అదేపనిగా మీ చేతిని గడ్డంపై పెట్టడం మూలాన మీ చేతిపై, ముఖంపై ఉన్న క్రిములు గడ్డం మీదకు చేరతాయి. తద్వారా అనేక చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

5. మీ శ్వాసక్రియ సక్రమంగా ఉండేందుకు ఎల్లప్పుడూ కాటన్ మాస్క్ ఉపయోగించండి. ఈ మాస్క్ ను ఉపయోగించిన తర్వాత పారివేయండి. ఎందుకంటే ఒకే మాస్క్ ను అనేక సార్లు వాడడం వల్ల మీకు చర్మ సమస్యలు రావడంతో ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు వస్తాయి.

6. మొత్తానికే గడ్డం లేకపోవడమూ సమస్యలకు దారితీయవచ్చు. దీని ద్వారా మీ చర్మం పొడిగా, తేమగా తయారవుతుంది. ఒకవేళ మీరు పూర్తిగా గడ్డాన్ని తొలగించాలని నిర్ణయించుకుంటే మరింత శ్రద్ధ తీసుకోండి.


7. మీకు స్కిల్ అలెర్జీలు లేదా ఇన్ఫెక్షన్లు ఉంటే, మీ గడ్డాన్ని తేమగా మరియు శుభ్రంగా ఉంచడానికి మాయిశ్చరైజర్ ను ఉపయోగించండి. మాస్క్ ధరించే ముందు మీ ముఖాన్ని శుభ్రం చేయడం మాత్రం మర్చిపోవద్దు.

8. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో ఫేస్ మాస్క్‌లు ధరించకుండా ఇళ్ళ నుండి బయటికి వెళ్లలేని పరిస్థితి. అందువల్ల కరోనా నుంచి, చర్మ సమస్యల నుంచి బయటపడాలంటే మీ గడ్డం పట్ల శ్రద్ధ వహించడం ఎంతో ముఖ్యం.
Published by: Nikhil Kumar S
First published: October 5, 2020, 5:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading