99 ఏళ్ల తాత గారి చాలెంజ్...కరోనా అంతు చూస్తానంటూ పంతం...

తన ఇంటి చుట్టూ 100 సార్లు నడుస్తానని చాలెంజ్ విసిరారు. అంతేకాదు తనను ప్రోత్సహించేందుకు విరాళాలు ఇవ్వాలని ఆయన సోషల్ మీడియా ద్వారా కోరారు.

news18-telugu
Updated: April 18, 2020, 11:33 AM IST
99 ఏళ్ల తాత గారి చాలెంజ్...కరోనా అంతు చూస్తానంటూ పంతం...
టామ్ మూర్ (Image : Twitter)
  • Share this:
సంకల్పం ఉండాలే కానీ వయస్సు, వైకల్యం ఏదీ అడ్డురావని లండన్ కు చెందిన 99 సంవత్సరాల రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ టామ్ మూర్ నిరూపించారు. తుంటి ఎముక విరిగి ఓ స్టాండ్ సహాయంతో నడిచే టామ్ కరోనాపై పోరాటం కోసం నిధులు సేకరిస్తున్నారు. అంతేకాదు ఆయన ఈ నెలలోనే 100 సంవత్సరం పుట్టినరోజు జరుపుకోనున్నారు. అయితే ఈ సందర్భంగా తన ఇంటి చుట్టూ 100 సార్లు నడుస్తానని చాలెంజ్ విసిరారు. అంతేకాదు తనను ప్రోత్సహించేందుకు విరాళాలు ఇవ్వాలని ఆయన సోషల్ మీడియా ద్వారా కోరారు. మూర్ ప్రయత్నానికి ముగ్ధులైన నెటిజన్లు పెద్ద ఎత్తున ఆయనకు విరాళాలు అందచేశారు. సుమారు 12 మిలియన్ పౌండ్లను ఆయన కలెక్ట్ చేశారు. అంటే సుమారు రూ. 100 కోట్లు ఆయన సేకరించారు. అయితే ఈ డబ్బును కరోనా బాధితుల సహాయార్థం ఖర్చుచేయాలని ఎన్ హెచ్ ఎస్ సంస్థకు విరాళం అందించారు. అంతేకాదు తన ప్రయత్నానికి అందరూ సహాయం చేయాలని టామ్ మూర్ కోరారు.
Published by: Krishna Adithya
First published: April 18, 2020, 11:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading