Home /News /coronavirus-latest-news /

CAPGEMINI INDIA GIVES SALARY HIKE TO 70 PERCENT STAFF EVEN IN CORONAVIRUS CRISIS SS

Salary Hike: కరోనా కష్టకాలంలో కూడా వారికి జీతాలు పెరిగాయి

Salary Hike: కరోనా కష్టకాలంలో కూడా వారికి జీతాలు పెరిగాయి
(ప్రతీకాత్మక చిత్రం)

Salary Hike: కరోనా కష్టకాలంలో కూడా వారికి జీతాలు పెరిగాయి (ప్రతీకాత్మక చిత్రం)

Coronavirus pandemic | కరోనా వైరస్ అన్ని రంగాలను దెబ్బకొడుతోంది. లక్షలాది మంది ఉద్యోగాలను ప్రమాదంలో పడేసింది. కానీ ఇంతటి కష్టకాలంలో ఆ కంపెనీ తమ ఉద్యోగులకు జీతాలు పెంచింది.

    ఇప్పుడు అసలే కష్టకాలం. కరోనావైరస్ సంక్షోభంతో అనేక రంగాలు కుదేలవుతున్నాయి. ఉద్యోగాలకు గ్యారెంటీ లేదు. జీతాలు పెరుగుతాయన్న మాటే లేదు. ఉద్యోగం పదిలంగా ఉంటే చాలన్న అభిప్రాయం ఉద్యోగులది. ఇలాంటి సమయంలో జీతాలు పెరుగుతాయని ఎవరూ ఆశలు పెట్టుకోవట్లేదు కూడా. ఉన్నజీతాలు ఉంటే చాలని అనుకుంటున్నారు. కారణం ఇప్పటికే పలు కంపెనీలు జీతాల్లో కోత ప్రకటించాయి. కానీ ఇంతటి కరోనా కష్టకాలంలో కూడా కొన్ని కంపెనీలు జీతాలు పెంచుతున్నాయంటే గొప్పే. ఫ్రెంచ్ ఐటీ దిగ్గజం క్యాప్ జెమినీ జీతాలు పెంచుతున్నట్టు ప్రకటించింది. భారతదేశంలో తమ కంపెనీలో పనిచేస్తున్న 70 శాతం ఉద్యోగులకు 2020 ఏప్రిల్ 1 నుంచి పెరిగిన జీతాలు వర్తిస్తాయని గుడ్ న్యూస్ చెప్పింది. భారతదేశంలో క్యాప్ జెమినీలో 1,20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంటే 84,000 మంది ఉద్యోగులకు జీతాలు పెరిగినట్టే. అంతే కాదు... మిగతా ఉద్యోగులకు జూలైలో జీతాలు పెరగనున్నాయి.

    జీతాలు పెంచుతున్నట్టు క్యాప్‌జెమినీ ఇండియా ప్రకటించడంతో ఉద్యోగుల్లో సంతోషానికి అవధుల్లేవు. కేవలం జీతాలు పెంచడం మాత్రమే కాదు... కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ఉద్యోగులకు రూ.10,000 క్యాష్ అలవెన్స్ కూడా ప్రకటించింది కంపెనీ. కంపెనీ మార్చి రెండో వారంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయం ప్రపంచానికి ఆలస్యంగా తెలిసింది. ఇక ఎలాంటి ప్రాజెక్టుల్లో పనిచేయకుండా బెంచ్‌పై ఉన్న ఉద్యోగులకు కూడా కంపెనీ జీతాలను చెల్లిస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారికి కూడా షిఫ్ట్ అలవెన్స్ ఇస్తోంది. 95 శాతం మంది ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన ప్రమోషన్లను జూన్‌లో ప్రకటించనుంది కంపెనీ. జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    SBI: ఏటీఎం కార్డులు ఉన్నవారికి ఎస్‌బీఐ గుడ్ న్యూస్

    LIC: కరోనావైరస్ ఎఫెక్ట్... ఎల్ఐసీ తీసుకున్న కీలక నిర్ణయాలివే

    Bank Jobs: బ్యాంకు జాబ్ కావాలా? ఈ ఎగ్జామ్స్ రాయండి
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Capgemini, CAREER, Corona, Corona virus, Coronavirus, Covid-19, Exams, Information Technology, Job notification, JOBS, Lockdown, NOTIFICATION, Technology

    తదుపరి వార్తలు