కరోనా కష్టకాలంలో మీ దగ్గర ఉన్న బంగారాన్ని కొద్ది కాలానికి తాకట్టు పెట్టి అప్పు తీసుకోవాలని అనుకుంటున్నారా? కెనెరా బ్యాంకు తక్కువ వడ్డీకే బంగారంపై రుణాలను అందిస్తోంది. అయితే వ్యాపారాలు చేసేవారు నగదు కొరతతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ ఆఫర్ ప్రకటించింది. ఈ రుణాలును సులువుగా, వేగంగా తక్కువ వడ్డీకే మంజూరు చేస్తామంటోంది కెనెరా బ్యాంకు. లాక్డౌన్ వల్ల మూతపడ్డ వ్యాపారాలను తిరిగి పుంజుకునేలా చేసేందుకు ఈ రుణాలు ఉపయోగపడతాయని బ్యాంకు చెబుతోంది. వడ్డీ వార్షికంగా 7.85% మాత్రమే. వ్యాపారులు ఈ రుణాలను వ్యవసాయ పనులకు, వ్యాపార కార్యకలాపాలకు, ఆరోగ్య అవసరాలకు, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.
భారతదేశంలోని కెనెరా బ్యాంక్ బ్రాంచ్లల్లో గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. వ్యవసాయ అవసరాలకు అయితే గరిష్టంగా రూ.10 లక్షలు, వ్యవసాయ సంబంధిత ఖర్చులు, ఆరోగ్య అవసరాలు, వ్యాపార అవసరాల కోసం అయితే గరిష్టంగా రూ.20 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. ఈ స్పెషల్ గోల్డ్ లోన్ ఆఫర్ 2020 జూన్ 20 వరకు మాత్రమే ఉంటుంది. అంటే 7.85% వడ్డీకే గోల్డ్ లోన్ తీసుకోవాలంటే జూన్ 20 వరకే అవకాశం ఉంటుంది. గోల్డ్ లోన్ తీసుకున్న కస్టమర్లు ఏడాది నుంచి మూడేళ్ల లోపు తిరిగి చెల్లించాలి. అయితే గోల్డ్ లోన్ తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకునేందుకు
ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునేముందు ఈ టిప్స్ గుర్తుంచుకోండి
Lockdown: క్రెడిట్ కార్డ్ ఉందా? లాక్డౌన్లో ఈ తప్పులు చేయొద్దు
Jan Dhan Account: 20 కోట్ల అకౌంట్లకు మనీ ట్రాన్స్ఫర్ పూర్తి... బ్యాలెన్స్ చెక్ చేయండిలా
Home Loan: సొంత ఇల్లు మీ కలా? హోమ్ లోన్ ఎంత తీసుకోవాలంటేPublished by:Santhosh Kumar S
First published:May 19, 2020, 10:18 IST