హోమ్ /వార్తలు /coronavirus-latest-news /

Covid vaccine: పీరియడ్స్ వేళ టీకా వేసుకోవచ్చా? పాలిచ్చే తల్లులు, గర్భిణుల పరిస్థితేంటి?

Covid vaccine: పీరియడ్స్ వేళ టీకా వేసుకోవచ్చా? పాలిచ్చే తల్లులు, గర్భిణుల పరిస్థితేంటి?

పాలిచ్చే తల్లులు ఎలాంటి అనుమానాలు లేకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. టీకా తీసుకున్న తరువాత తల్లుల్లో వృద్ధి చెందే యాంటీబాడీలు పాల ద్వారా పిల్లలకు కూడా చేరుతాయి.

పాలిచ్చే తల్లులు ఎలాంటి అనుమానాలు లేకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. టీకా తీసుకున్న తరువాత తల్లుల్లో వృద్ధి చెందే యాంటీబాడీలు పాల ద్వారా పిల్లలకు కూడా చేరుతాయి.

పాలిచ్చే తల్లులు ఎలాంటి అనుమానాలు లేకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. టీకా తీసుకున్న తరువాత తల్లుల్లో వృద్ధి చెందే యాంటీబాడీలు పాల ద్వారా పిల్లలకు కూడా చేరుతాయి.

    కరోనా మహమ్మారిని పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ ద్వారానే నిరోధించడం సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ కరోనా వ్యాక్సిన్లపై ఇప్పటికీ ప్రజల్లో అపోహలు నెలకొన్నాయి. చాలామంది భయాందోళనలతో టీకాలు తీసుకునేందుకు ముందుకు రావట్లేదు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి వ్యాక్సినేషన్‌పై ఎన్నో అపోహలు నెలకొంటున్నాయి. కొన్ని రోజుల క్రితం పీరియడ్స్‌లో ఉండేవారు, పాలిచ్చే తల్లులు టీకా తీసుకోకూడదని వార్తలు వినిపించాయి. కానీ ఇవన్నీ అపోహలేనని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో గర్భిణులు, నెలసరి సమస్యలతో బాధపడేవారు, పాలిచ్చే తల్లులు, మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళలు టీకాలు పొందడంపై నెలకొన్న అపోహలను వైద్య నిపుణులు దూరం చేస్తున్నారు. వీటికి సంబంధించి ప్రజల్లో నెలకొన్న అనుమానాలు, వాటికి సమాధానాలు పరిశీలిద్దాం.

    * నెలసరి సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?

    నెలసరి సమయంలో మహిళ హార్మోన్లలో మార్పులు జరగడం సాధారణ విషయం. ఈ సమయంలో వారి రోగనిరోధక శక్తి తగ్గుతుంది అనుకోవడం అపోహ. ఒక వ్యక్తి రోగనిరోధక శక్తి ఒక్క రోజులో పెరగదు, ఒకేసారి తగ్గదు. పీరియడ్స్‌లో ఉన్న మహిళలు సైతం జిమ్‌లలో వ్యాయామాలు చేయాలని గైనకాలజిస్ట్‌లు సలహా ఇస్తున్నారు. అందువల్ల నెలసరి అనేది కరోనా వ్యాక్సిన్‌కు ఏమాత్రం అడ్డంకి కాదని నిపుణులు ధ్రువీకరిస్తున్నారు.

    * పీరియడ్స్‌ సమయంలో వచ్చే కడుపు నొప్పి, వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఎక్కువ అవుతుందా?

    అన్ని రకాల వ్యాక్సిన్లతో దుష్ప్రభావాలు ఉంటాయి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా ఒళ్లు నొప్పులు, తేలికపాటి జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పీరియడ్స్‌తో సంబంధం లేకుండా అందరిలోనూ ఇలాంటి దుష్ప్రభావాలు కనిపించవచ్చు. అందువల్ల వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. డాక్టర్ల సలహాతో పారాసెటమాల్ మాత్రలు తీసుకోవడంతో పాటు ఇతర జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది.

    * రుతుస్రావం సమయంలో ఏర్పడే బలహీనత, నీరసం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఎక్కువ అవుతాయా?

    పీరియడ్స్ సమయంలో కొంతమందిలో రక్తపోటు తగ్గవచ్చు. ఇలాంటప్పుడు నీరసంగా అనిపిస్తుంది. ఈ సందర్భాల్లో ఎనర్జీ డ్రింక్, నిమ్మకాయ రసం, నీరు ఎక్కువగా తాగాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. దీనివల్ల బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. దీంతోపాటు వ్యాక్సిన్‌ తీసుకోవడానికి వెళ్లేముందు తప్పనిసరిగా ఏదైనా తినాలి. ఖాళీ కడుపుతో టీకాలు తీసుకోకూడదు.

    * కరోనా వ్యాక్సిన్ సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందా?

    మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యం అండాశయాలు, గర్భాశయం, హార్మోన్లపై ఆధారపడి ఉంటుంది. కరోనా వ్యాక్సిన్లకు సంతానోత్పత్తికి ఎలాంటి సంబంధం ఉండదు. కోవిడ్ టీకాలు సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయని కొన్ని నెలల క్రితం ప్రచారం జరిగింది. కానీ ఇవన్నీ అపోహలేనని నిపుణులు తేల్చారు.

    * కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సంతానం కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు అవసరమా?

    రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత పిల్లల కోసం ప్రయత్నించవచ్చు. సాధారణంగా మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న ఆరు నుంచి ఎనిమిది వారాల మధ్య రెండవ డోసు తీసుకోవాలి. ఈ మధ్యలో శరీరం కొన్ని దుష్ప్రభావాలను ఎదుర్కొంటుంది. ఎనిమిది వారాల తరువాత పూర్తి స్థాయిలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. ఆ తరువాత పిల్లల కోసం ప్లాన్ చేయడం మంచిది.

    * గర్భిణులు వ్యాక్సిన్ తీసుకోవచ్చా?

    కరోనా వ్యాక్సిన్లు గర్భంతో ఉన్న మహిళలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపవు. గర్భిణులకు కరోనా సోకినా, ఇతరుల మాదిరిగానే కోలుకునే అవకాశాలు ఎక్కువ. వీరు కూడా ఎలాంటి అనుమానాలు లేకుండా టీకా తీసుకోవచ్చు. కానీ మన దేశంలో ఉన్న వ్యాక్సిన్లను గర్భిణులపై ప్రయోగించలేదు. అందువల్ల కేంద్రం వీరికి వ్యాక్సినేషన్‌ను సిఫారసు చేయలేదు. అందువల్ల వైద్య నిపుణుల సలహాతో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది.

    * కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత గర్భం దాల్చితే ఏం చేయాలి?

    కోవిడ్ వ్యాక్సిన్లు కడుపులో పెరిగే పిండంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపవు. అందువల్ల టీకా తీసుకున్న తరువాత గర్భం నిర్ధారణ అయినప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు.

    * పాలిచ్చే తల్లులు కరోనా టీకాలు తీసుకోవచ్చా?

    పాలిచ్చే తల్లులు ఎలాంటి అనుమానాలు లేకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. టీకా తీసుకున్న తరువాత తల్లుల్లో వృద్ధి చెందే యాంటీబాడీలు పాల ద్వారా పిల్లలకు కూడా చేరుతాయి. దీనివల్ల చిన్నారులకు కూడా రక్షణ లభిస్తుంది. కానీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తల్లులు బిడ్డను దగ్గరకు తీసుకున్నప్పుడు కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ పాలు ఇవ్వాలి.

    * PCOD సమస్య ఉన్నవారు టీకాలు తీసుకోవచ్చా?

    వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్లకు ఇతర శారీరక సమస్యలకు ఎలాంటి సంబంధం ఉండదు. మధుమేహం, బరువు పెరగడం, హార్మోన్ల లోపాలు వంటి PCOD సమస్యలను సైతం వ్యాక్సిన్లు కొంత వరకు తగ్గించే అవకాశం ఉంది. అందువల్ల ఇతర హార్మోన్ల సమస్యలు ఉన్నవారు కూడా కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకోవచ్చు.

    First published:

    ఉత్తమ కథలు