రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని గవర్నర్ బైపాస్ చేయొచ్చా? తమిళిసై రివ్యూపై జోరుగా చ‌ర్చ‌

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌తో రాష్ట్రంలో కోవిడ్ పై సమీక్షించిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్

తెలంగాణలో కరోనా విజృంభణపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చీఫ్ సెక్రటరీ, ఆరోగ్య శాఖ కార్యదర్శిని పిలిచి సమీక్ష నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

 • Share this:
  (ఎం. బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్ 18)

  తెలంగాణ‌లో కరోనా మ‌హమ్మారి త‌న ఉగృరూపాన్ని చూపిస్తోంది. దీనికి తోడు రాష్ట్ర ప్ర‌భుత్వం కోవిడ్ నియంత్రణ ప‌ట్ల వ్య‌వ‌హారించే తీరు... కేసులు సంఖ్య రోజు రోజుకి పెరిగిపోవ‌డానికి కార‌ణ‌మవుతోంది. దీంతో గ‌వ‌ర్న‌ర్ తమిళి సై సౌందర్ రాజన్ ప్ర‌భుత్వ బాధ్య‌త‌లు తీసుకోవాల‌ని అటు సోష‌ల్ మీడియా లోను, ఇటు ప్ర‌తిప‌క్ష పార్టీలు పెద్ద ఎత్తున ప్ర‌తిపాద‌న‌లు చేస్తున్నాయి. అస‌లు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌భుత్వ బాధ్యతను తీసుకోవ‌చ్చా? ప‌్ర‌జ‌లు ఎన్నుకున్న‌ది గ‌వ‌ర్న‌ర్ నా? లేక ముఖ్య‌మంత్రినా? అస‌లు గ‌వ‌ర్న‌ర్ ప‌రిధి ఎంత వ‌ర‌కు ఉంటుంది? అనే అంశాలపై జోరుగా చర్చ సాగుతోంది.

  గ‌వ‌ర్న‌ర్ ప్ర‌భుత్వ బాధ్య‌త‌ల‌ను పూర్తి స్థాయిలో తీసుకోవ‌డానికి వీలు లేద‌ని రాజ్యంగ నిపుణులు చెబుతున్నారు. మంగ‌ళ‌వారం గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందర్ రాజన్.. సీఎస్, ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శిల‌ను పిలిచి మాట్లాడ‌డం కూడా ఒక విధంగా బైపాస్ చేయ‌డ‌మే అంటున్నారు. వాస్త‌వానికి రాష్ట్రంలో ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇది ఎవ‌రూ కాద‌న‌లేని అంశం. ప్ర‌భుత్వం ఈ క్లిష్ట‌ప‌రిస్థితిని సరిగ్గా నియంత్రించ‌డం లేదనే విమ‌ర్శ‌లు పెద్ద సంఖ్య‌లు ఉన్నాయి. అంత మాత్రాన గ‌వ‌ర్న‌ర్ ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉన్న ప్ర‌భుత్వాన్ని బైపాస్ చేసి నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి రాజ్యంగప‌రంగా ఎటువంటి అధికారాలు లేవు. రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్ ప‌రిధి ప‌ట్ల రాజ్యంగంలో చాలా స్ప‌ష్టంగా చెప్పారు. ఎందుకంటే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌త్యక్షంగా ప్ర‌జ‌ల నుంచి ఎన్నుకున్న వ్య‌క్తి కాదు. దీంతో పాటు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యక్ష జ‌వాబుదారి కాదు. ప్ర‌భుత్వం మాత్ర‌మే ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారి. అందుకే రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్ ప‌రిధి చాలా త‌క్కువ‌. తాను కేవ‌లం రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను స‌మాచారం తీసుకోని ఏది మంచిదో అది ప్ర‌భుత్వానికి సూచించ‌గ‌లరు కాని ప్ర‌భుత్వానికి అది చేయ‌మ‌ని ఆదేశించలేరు.  గ‌వ‌ర్న‌ర్ ప్ర‌భుత్వంలో ఉన్న అధికారుల‌ను, మంత్రుల‌ను, ముఖ్య‌మంత్రుల‌ను రాష్ట్రంలో నెల‌కున్న ప‌రిస్థితిలు పై చ‌ర్చించ‌డానికి ఆహ్వానించ‌వ‌చ్చు. అంత మాత్రాన గ‌వ‌ర్న‌ర్ చెప్పింది ప్ర‌భుత్వం ఫాలో అవ్వాల‌ని ఎక్క‌డ రాజ్యంగంలో లేదు. అయితే మ‌రికొన్ని వాదన‌లు కూడా ఉన్నాయి. గ‌వ‌ర్న‌ర్ ఎమ‌ర్జ‌న్సీ విధించాలని కేంద్రానికి సిఫారసు చేసే అవ‌కాశం ఉంది కాదా అనే వాదన కూడా ఉంది. గ‌వ‌ర్న‌ర్ అత్య‌యిక ప‌రిస్థితిని పెట్టే అవ‌కాశాలు ఉంటాయి కాని వాటి కొన్ని ప్ర‌త్యేక ప‌రిమితులు ఉన్నాయని అంటున్నారు రాజ్యంగా నిపుణులు. రాష్ట్ర ప్ర‌భుత్వం రాజ్యాంగబ‌ద్దంగా ప‌రిపాల‌న చేయ‌న‌ప్పుడు గ‌వ‌ర్న‌ర్ అప్పుడు ఆర్టిక‌ల్ 356 ఏ క్రింద రిపోర్ట్ ఇవ్వ‌చ్చు. అంతే త‌ప్ప రాష్ట్రంలో ఉన్న ప్ర‌భుత్వాన్ని బైపాస్ చేసి పాల‌నప‌ర‌మైన అంశాల్లో వేలు పెట్ట‌డానికి కుద‌ర‌ద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

  “ఇది చాలా క్లిష్ట‌మైన అంశం పైకి గ‌వ‌ర్న‌ర్ ప్రభుత్వాన్ని శాసించేట్లుగా క‌నిపించిన రాజ్యంగంలో కాస్త లోతుగా వెళ్తే గ‌వ‌ర్న‌ర్ ప‌రిధి మ‌న‌కు అర్ధ‌మ‌వుతుంది. గ‌వ‌ర్న‌ర్ రాష్ట్రంలో నెల‌కున్న‌ప‌రిస్థితిపై స‌మ‌గ్ర రిపోర్ట్ ను తెప్పించుకోవ‌చ్చు, అధికారుల‌తో, మంత్రుల‌తో స‌మావేశాలు నిర్వ‌హించ‌వ‌చ్చు వాళ్ల‌ను స‌మాచారం కోసం పిలిపించ‌వ‌చ్చు. అంత స‌మాచారం తీసుకున్న త‌రువాత గ‌వ‌ర్న‌ర్ త‌న స‌ల‌హాను ప్రభుత్వానికి ప్ర‌తిపాదించ‌వ‌చ్చు. మీకు బాగా అర్ధ‌మ‌వ్వ‌లంటే త‌రుచుగా ప్ర‌తిప‌క్ష‌పార్టీలు... కొంత మంది ప్ర‌ముఖులు గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి త‌మ మోమోరండం ను సమ‌ర్పిస్తారు అంటే గ‌వ‌ర్న‌ర్ ను చ‌ర్య‌లు తీసుకోవ‌మ‌ని కాదు. ఈ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వ దృష్ఠికి తీసుకెళ్ల‌మ‌ని మాత్ర‌మే. అలా కాకుండా చ‌ర్య తీసుకోండి అని పిర్యాదు చేస్తే అది త‌ప్పు అవుతుంది. అయితే అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిల్లో గ‌వ‌ర్న‌ర్ కు ఆర్టికల్‌ 356 ఏ క్రింద కొన్ని ప్ర‌త్యేక అధికారాలు ఉంటాయి ప్ర‌భుత్వం రాజ్యాంగానికి లోబ‌డి ప‌ని చేయ‌న‌ప్పుడు రాజ్యాంగ వ్య‌తిరేక నిర్ణ‌యాలు తీసుకున్న‌ప్పుడు మాత్ర‌మే గ‌వ‌ర్న‌ర్ త‌ల‌దూర్చ‌గ‌లుగుతారు.” అని ప్ర‌ముఖ రాజ్యాంగ నిపుణులు ప్రొ. గాలి వినోద్ న్యూస్ 18 కు తెలిపారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: