ప్రతికాత్మక చిత్రం
సెక్స్ ద్వారా కరోనా సంక్రమిస్తుందా? దీనికి సంబంధించి చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, తాజాగా చైనాలో మరో స్టడీ వెలుగులోకి వచ్చింది. మగవారి వీర్య కణాల్లో కరోనాను కలిగించే వైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. అయితే, అతి తక్కువ శాంపిల్స్‌తో ఈ స్టడీ నిర్వహించారు. కరోనా వైరస్ బారిన పడిని 38 మంది బాధితులలో ఆరుగురి వీర్య కణాలు చెక్ చేయగా, అందులో కరోనాను కలిగించే వైరస్ లక్షణాలు కనిపించారు. ఆ ఆరుగురిలో నలుగురి అత్యంత అనారోగ్యంతో ఉన్నారు. ఓ ఇద్దరి పరిస్థితి కొంచెం బెటర్‌గానే ఉంది. JAMA నెట్ వర్క్ ఓపెన్‌లో ఈ స్టడీకి సంబంధించిన వివరాలు పబ్లిష్ అయ్యాయి. అయితే, ఎంతకాలం పాటు ఆ వీర్య కణాల్లో వైరస్ ఉంటుంది? దీర్ఘకాలం పాటు ఉంటుందా? కొంతకాలం పాటే ఉంటుందా? సెక్స్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందా? అనే విషయంపై మరింత సుదీర్ఘంగా పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
గతంలో నిర్వహించిన ఓ స్టడీకి భిన్నంగా ఈ రిజల్ట్స్ వచ్చాయి. గతంలో 34 మంది మీద జరిపిన పరిశోధనలో వారి వీర్య కణాల్లో ఎలాంటి కరోనాను కలిగించే వైరస్‌ను కూడా గుర్తించలేదు. కరోనా నుంచి కోలుకున్న 8 రోజుల నుంచి మూడు నెలల పాటు వారిని పరిశీలించారు. కరోనాతో బాగా బాధపడుతున్న వారి మీద ఈ పరిశోధన జరిపినట్టు ఈ పరిశోధనలో పాల్గొన్న డాక్టర్ జాన్ హోటలింగ్ అన్నారు. కరోనా వచ్చిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపరలు అవతలి వారి మీద పడితే వారికి వైరస్ వ్యాపిస్తుందని ఇంతకాలం పరిశోధకులు చెప్పారు. మరికొన్ని పరిశోధనల్లో రక్తంలోను, కన్నీటిలో కూడా వైరస్ లక్షణాలను గుర్తించినట్టు చెప్పారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
May 8, 2020, 2:40 PM IST