Andhra Pradesh: బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ ఇస్తామని కాల్స్ వస్తున్నాయా.. డిటైల్స్ ఇస్తే అంతే

బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ పేరుతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ

బ్లాక్ ఫంగస్ పేరుతో బురిడీ కొట్టించే వారు ఉన్నారు బీ కేర్ ఫుల్.. అవసరాన్ని గుర్తించి మరీ ఫోన్ చేస్తారు.. మీ వివారాలు అడుగుతారు. అవసరం ఉంది కదా అని డబ్బులు చెల్లించే ప్రయత్నం చేస్తే.. బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ చేస్తారు కేటుగాళ్లు..

 • Share this:
  GT Hemanth Kumar, Tirupati Correspondent, News18                                              బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ ఇస్తామని కాల్స్ వస్తున్నాయా బీకేర్ ఫుల్. బ్లాక్ ఫంగస్ రాకుండా ఉండేందుకు ఇంజెక్షన్ కావాలా అంటూ... ఫోన్ చేస్తారు. ఆ తరువాత మీ వివరాలు అడుగుతారు. ఇంజక్షన్  కోసమని మీ వివరాలతో పాటు యూపీఐ ఐడి ఇస్తే అకౌంట్లో ఉన్న నగదంతా గోవిందా. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న బాధితులకి ఇప్పుడు బ్లాక్ ఫంగస్ భయం వెంటాడుతోంది. అసలే ఖరీదైన వైధ్యం.. ఆపై మందులు దొరకని వైనం. దింతో బ్లాక్ ఫంగస్ బారినపడ్డ బాధితులకు చికిత్స అందించినా.. పూర్తిగా ఫంగస్ నివారణకు 15 రోజుల పాటు ప్రత్యేక ఇంజెక్షన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ ఇంజెక్షన్ కు ఉన్న డిమాండ్ అంత ఇంత కాదు.

  బ్లాక్ మార్కెట్ లో ఆ ఇంజెక్షన్ కొనాలి  అంటే దాని ధర 30 నుంచి 50 వేల రూపాయల వరకు ఉంటుంది. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితులను సైతం కొందరు మాయగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. రెమిడిసివర్సి నుంచి ఇప్పుడు బ్లాక్ ఫంగస్ వరకు తమ దగ్గర ఉందంటూ అన్ లైన్ లో ప్రకటనలు ఇస్తుంటారు. సొమ్ము చేతికి అంటిన అనంతరం మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు.  ఆన్ లైన్ లో మందులు కొనుగోలు నకిలీ వెబ్ సైట్స్ లలోని ఫోన్ నంబర్లను సంప్రదిస్తే అంతే సంగతులు. బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ లేదా  మందులు కావాలా అంటూ ఫోన్ వస్తే.. అప్రమత్తంగా వ్యవహరించాలి లేదంటే  అకౌంట్ లోని నగదు గల్లంతు అవ్వాల్సిందే.

  ఇదీ చదవండి: నా చావుకు నా భార్యే కారణం అంటూ ఆత్మహత్య.. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?

  స్విమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం అధిక సంఖ్యలో బ్లాక్ ఫంగస్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల కిందట శస్త్ర చికిత్స అందిచి బ్లాక్ ఫంగస్ తో ఇన్ఫెక్ట్ అయిన కణాలను ఓ వ్యక్తికి తొలగించారు వైద్యులు. బాధితుడు పూర్తిగా కోలుకోవాలంటే 15 రోజుల పాటు (Amphotericin B injections) అంఫోరేరిసిన్ బీ ఇంజక్షన్ ను ఐదు రోజుల పాటు వినియోగించాలని వైద్యులు సూచించారు. తమ దగ్గర స్టాక్ లేవని బయట నుంచి తీసుకురావాలని బ్లాక్ ఫంగస్ బారిన పడ్డ బాధితుని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో ఇంజెక్షన్ కోసం.. బాధిత కుటుంబ సభ్యులు తిరుపతి నలుమూలల ప్రాంతాలలోని మెడికల్ షాప్స్, ఏజన్సీస్, ఆసుపత్రులు అన్ని తిరిగారు కానీ ఎక్కడ ఇంజక్షన్ లభ్యం కాలేదు.

  ఇదీ చదవండి: సీఎం జగన్ కీలక నిర్ణయం.. సహజమరణం చెందిన వ్యక్తి కుటుంబానికి బీమా.. షరతులు ఇవే..

  ఇంజెక్షన్ దొరకలేదని ఆవేదనతో బ్లాక్ మార్కెట్లో అయినా దొరుకుతుందేమొనని ప్రయత్నాలు  చేశారు. అయినా దొరకలేదు. దీంతో గల్ఫ్ దేశంలో ఉన్న కుమార్తె ఆన్ లైన్ లో బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ కోసం వెతిక సాగింది. అందులో కనపడ్డ ఓ నెంబర్ కు కాల్ చేయగా.. తాము ఢిల్లీలో ఉంటామని, బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ స్టాక్ తమ వద్ద ఉన్నాయని.. కావాలి అనుకుంటే ముందుగా ఇంజక్షన్ తీసుకురావడానికి కార్గో ఛార్జ్ ముందుగా చెల్లించాలని కండిషన్ పెట్టారు. కండిషన్ కు ఒకే అంటే ముందుగా డబ్బులు పంపమని అకౌంట్ నెంబర్ పంపారు. నాన్న ప్రాణం కాపాడుకోవాలన్న ఆందోళనలో ఉన్న వారు అకౌంట్ కు 30 వేలు నగదు జమ చేశారు.

  తిరుపతి ఎయిర్ పోర్టుకు వెళ్లి ఇంజెక్షన్ కార్గో లో తీసుకోని మిగిలిన మొత్తని చెల్లించాలని తెలిపారు. అయితే కార్గోకు వెళ్లి అరా తీసిన వారికీ చేతులు కాల్చుకున్నామని అర్థమైంది. చేసేదేమి లేక అక్కడనుంచి వెనుదిరిగారు బాధితులు. ఇక ఇదే విధంగా బ్లాక్ ఫంగస్ బారిన పడి నెల్లూరుకు చెందిన రాజేష్  స్విమ్స్ లో చికిత్స పొందుతున్నారు. బ్లాక్ ఫంగస్ కు ఇంజెక్షన్ కావాలా అంటూ బాధిత కుటుంబ సభ్యులకు  రెండు మూడు రోజులుగా తరచూ కాల్స్ వస్తున్నాయి.

  ఇదీ చదవండి: 13 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆ అభ్యర్థులకు తీపి కబురు చెప్పిన సీఎం జగన్

  తమ దగ్గర ఇంజెక్షన్లు ఉన్నాయి...  కావాలంటే డబ్బులు కడితే ఇంజక్షన్ చేరవేస్తామని కాల్స్ రావడంతో...  తన నెంబర్ మీకు ఎవరు ఇచ్చారు అని రాజేష్ కుమారుడు ప్రశ్నించాడు. దింతో ఆ కాలర్ ట్విట్టర్ ద్వారా చూసి చేస్తున్నామని సమాధానం ఇచ్చారు. నిజానికి అతనికి ట్విట్టర్ లో ఖాతా లేదు.. దీంతో ఫ్రాడ్ కాల్ అని అతడు గుర్తించాడు.. ఇలా జాగ్రత్తలు తీసుకోకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ అయ్యి ఉండేంది..
  Published by:Nagesh Paina
  First published: