హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

నవంబరు వరకు రేషన్ ఉచితం.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే

నవంబరు వరకు రేషన్ ఉచితం.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే

ప్రకాశ్ జావడేకర్ (కేంద్ర మంత్రి)

ప్రకాశ్ జావడేకర్ (కేంద్ర మంత్రి)

కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులకు గురికాకూడదనే ఉద్దేశంతోనే ఆత్మనిర్బర్ ప్యాకేజీలో ప్రకటించిన పథకాలు, కార్యక్రమాలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్రవేసినట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు.

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా కాలంలో పేదలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో గరీబ్ కల్యాణ్ అన్న యోజనను నవంబరు ఆఖరు వరకు పొడిగించింది. ఈ పథకం కింద ప్రతినెలా ప్రతి ఒక్కరికీ 5 కేజీల బియ్యం లేదా 5 కేజీల గోధుమ పిండి, ఒక్కో కుటుంబానికి 1కేజీ కంది పప్పును ఉచితంగా అందిస్తున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ పథకం ద్వారా దేశంలోని 81 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరనుంది.

ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన/ఆత్మ నిర్బర్ భారత్ కింద... 24 శాతం ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ (12 శాతం ఎంప్లాయి షేర్, 12 శాతం ఎంప్లాయర్ షేర్)ను మరో మూడు నెలలు పొడిగించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 4,860 కోట్లు కేటాయించింది. ఈ నిర్ణయంతో 72 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

అటు ఉజ్వల పథకం లబ్ధి దారులకు కూడా కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. 2020 జూలైలో ముగియనున్న ఈఎంఐ డెఫర్‌మెంట్ స్కీమ్‌ గడువును మరో మూడు నెలల పాటు పొడిగించింది. దీని ప్రకారం వచ్చే 3 నెలల పాటు ఉజ్వల స్కీమ్ కస్టమర్లు ఈఎంఐ డబ్బులను చెల్లించాల్సిన పని లేదు. ఇందుకోసం కేంద్రం రూ.13,500 కోట్లను కేటాయించింది.

ప్రభుత్వ రంగ బీమా సంస్థలైన ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీల్లోకి రూ.12,450 కోట్లను క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద పట్టణాలు, నగరాల్లో ఉండే పేదల కోసం.. అందుబాటు ధరలో లభించేలా అద్దె భవనాలను నిర్మించాలని నిర్ణయించింది.  ఈ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి ఇవాళ కేబినెట్ ఆమోద ముద్రవేసింది. ఈ భవనాల్లో వలస కార్మికులతో పాటు ఇతర పేద వర్గాలకు తక్కువ ధరకే గదులను అద్దెకు ఇస్తారు.

కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులకు గురికాకూడదనే ఉద్దేశంతోనే ఆత్మనిర్బర్ ప్యాకేజీలో ప్రకటించిన పథకాలు, కార్యక్రమాలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్రవేసినట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు.

First published:

Tags: Central cabinet, Prakash Javadekar

ఉత్తమ కథలు