బస్ డ్రైవర్‌ను కొట్టిచంపిన ప్రయాణికులు... మాస్క్ పెట్టుకోమంటే...

కరోనా విషయంలో ప్రజలు నానాటికీ కఠిన హృదయుల్లా మారిపోతున్నారా? బస్ డ్రైవర్‌ను చంపేసేంత గొడవ ఎందుకు జరిగింది?

news18-telugu
Updated: July 11, 2020, 7:35 AM IST
బస్ డ్రైవర్‌ను కొట్టిచంపిన ప్రయాణికులు... మాస్క్ పెట్టుకోమంటే...
బస్ డ్రైవర్‌ను కొట్టిచంపిన ప్రయాణికులు... మాస్క్ పెట్టుకోమంటే... (credit - twitter)
  • Share this:
అతను ఫ్రాన్స్‌లోని 59 ఏళ్ల ఫిలిప్పే మంగీల్లాట్. బస్ డ్రైవర్. ఐదు రోజుల కిందట... మంచు పడుతున్న సమయంలో.... బయొన్నేలో.. బస్ నడుపుతున్నాడు. ఆ రోజు బస్సులో ప్రయాణికులెవరూ లేరు. ఓ నిర్మానుష్య ఏరియాలోని రోడ్డులో బస్సు వెళ్లసాగింది. మంచు వర్షం లాంటిది పడుతుంటే.... చలికి ప్రజలెవరూ ఇళ్లలోంచీ బయటకు రావట్లేదు. ఈ రోజు కష్టమర్లు లేరు. బిజినెస్ డల్‌గా ఉంది అనుకుంటూ... ఫిలిప్పే బస్ ముందుకు నడపసాగాడు. ఓ మలుపు దగ్గర... ఓ ముగ్గురు కుర్రాళ్లు... చెట్లు, పొదల్లోంచీ పరుగెడుతూ... బస్సువైపు రాసాగారు. స్టాప్ స్టాప్ అని అరవసాగారు. అక్కడ బస్టాప్ లేకపోయినా... వాళ్లు ఇబ్బంది పడుతున్నారని ఊహించి... బస్సు ఆపాడు డ్రైవర్.

బస్సు ఎక్కుతున్న వాళ్లను... ముఖాలకు మాస్కు పెట్టుకోమని చెప్పాడు ఫిలిప్పే. వాళ్లు ముగ్గురూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని... గట్టిగా నవ్వి... మాస్కెందుకు... అవసరం లేదు. మాకు కరోనా రాదు అని నవ్వుకున్నారు. డ్రైవర్‌కి కోపం వచ్చింది... "కరోనా వచ్చినా రాకపోయినా... మాస్క్ తప్పనిసరి" అన్నాడు. "ఆ పెట్టుకుంటాంలో బస్సు దిగాక... పోనీ పోనీ" అన్నాడొకడు. డ్రైవర్ బస్సు నడపకుండా... "చూడండి... మీ దగ్గర మాస్క్ లేకపోతే... బస్సు దిగిపోండి. మాస్క్ ఉంటేనే బస్ లోకి అనుమతి ఉంటుంది" అన్నాడు. ఆ మాట వినడంతోనే... ముగ్గురిలో ఒకడు... "ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావ్. నా సంగతి నీకు తెలీదు. నోర్మూసుకొని బస్సు నడుపు" అన్నాడు.

డ్రైవర్‌కి కోపం పెరిగింది. "ముగ్గురూ బస్సు దిగండి... ఊ" అన్నాడు. అంతే... ఆ ముగ్గురూ ఒకేసారి మీద పడి... డ్రైవర్‌ను చితకబాదారు. డ్రైవర్ తలను ఇనుప రాడ్డుకు తగిలేలా గట్టిగా కొట్టారు. రక్తం ప్రవాహంలా వచ్చింది. ఆ ముగ్గురూ బస్సు దిగి పారిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన డ్రైవర్‌ను కాసేపటి తర్వాత స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. కానీ తలకు బలమైన గాయం అవ్వడం వల్ల శుక్రవారం అతను బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు తేల్చారు. ఇలా మాస్క్ పెట్టుకోమని చెప్పడమే తప్పైపోయింది. అన్యాయంగా ప్రాణం తీసేశారు ఆ దుర్మార్గులు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Published by: Krishna Kumar N
First published: July 11, 2020, 7:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading