హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Vaccine Offer: బంపర్ ఆఫ‌ర్.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే 60 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ.. ఆఫర్ ఎక్కడో కాదు మనదగ్గరే..?

Vaccine Offer: బంపర్ ఆఫ‌ర్.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే 60 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ.. ఆఫర్ ఎక్కడో కాదు మనదగ్గరే..?

చైనాతోపాటు యూకేలోనూ కొత్త కేసులు పెరుగుతున్నాయి. యూకేలో కొత్త వేరియంట్ ఎక్స్ఈ ప్రభావాన్ని చూపుతోంది. కరోనా బీఏ2 ఒమిక్రాన్ తో పోలిస్తే ఒమిక్రాన్ ఎక్స్ఈ సబ్ వేరియంట్10 శాతం వృధ్ధిరేటు ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.(ప్రతీకాత్మక చిత్రం)

చైనాతోపాటు యూకేలోనూ కొత్త కేసులు పెరుగుతున్నాయి. యూకేలో కొత్త వేరియంట్ ఎక్స్ఈ ప్రభావాన్ని చూపుతోంది. కరోనా బీఏ2 ఒమిక్రాన్ తో పోలిస్తే ఒమిక్రాన్ ఎక్స్ఈ సబ్ వేరియంట్10 శాతం వృధ్ధిరేటు ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.(ప్రతీకాత్మక చిత్రం)

Vaccine Bumper Offer: కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం ఎక్కువ ఉన్న సమయంలో అంతా వ్యాక్సినేషన్ కోసం ఎగబడ్డారు. కానీ ఆ ప్రభావం తగ్గాక వ్యాక్సిన్ పై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ లోపై మరో కొత్త వేరియంట్ ప్రపంచంపై దాడి చేస్తతోంది. దీంతో మళ్లీ వ్యాక్సినేషన్ రేటును పెంచడానికి వివిధ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఓ బంపర్ ఆఫర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ఆఫర్ కోసమైనా వ్యాక్సిన్ వేయించుకోవాలి అనిపించక మానదు..

ఇంకా చదవండి ...

  Smart Phone free for Vaccine:  ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ (Omicron Corona Variant). ఈ వేరియంట్ వ్యాపించిన దేశాలు లాక్‌డౌన్‌లు విధించాలని చూస్తున్నాయి. భారత్‌తో పాటు అనేక దేశాలు ప్రయాణ ఆంక్షలను సైతం విధిస్తున్నాయి. కరోనా కొత్త వేరియం ట్ ఒమిక్రాన్తో ప్రపం చానికి తీవ్ర ముప్పు పొంచి ఉం దని ప్రపం చ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దక్షిణాఫ్రికాలో ఈ కరోనా కొత్త వేరియం ట్ వెలుగుచూసిన సం గతి తెలిసిం దే. ఆ వేరియంట్‌లోని అసాధారణ మ్యుటేషన్లపై ఆందోళన వ్య‌క్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్ప టివరకు వెలుగు చూసిన ఆల్ఫా , బీటా, గామా వేరియంట్లకంటే ప్రమాదకరమైన జాబితాలోకి చేర్చింది. ఈ జాబితాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ మాత్రమే ఉంది. ఇక‌పై ఒమ్రికాన్ చేరే అవకాశం ఉందని డ‌బ్ల్యూహెచ్ఓ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

  క‌రోనా మ‌హ‌మ్మారిని కట్టడి చేయాలంటే ఇప్పుడు ఉన్నది ఒక్కటే మార్గం. అదే వ్యాక్సిన్(Vaccine) . టీకాతోనే మహమ్మారి నుంచి సంపూర్ణ రక్షణ లభిస్తుంది అన్నది వైద్య నిపుణుల మాట. వ్యాక్సిన్ వేసుకున్న తరువాత కూడా కొత్త కొత్త వేరియంట్లు దాడి చేస్తున్నాయి. అయినా ఇప్పటి వరకు ఉన్నప్రత్యామ్నాయాలు చూస్తే.. కరోనాను ఎదుర్కోడానికి వ్యాక్సినేషన్ మాత్రమే సరైన మందు. ఈ విషయాన్ని నిపుణులు ఇదివరకే చెప్పారు. ఇప్పుడు కూడా అదే చెబుతున్నారు. అర్హులైన వారందరూ కచ్చితంగా రెండు డోసుల టీకా తీసుకోవాలని, కరోనా నుంచి రక్షణ పొందాలని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలోని అన్ని దేశాలు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగంగా అమ‌లు చేస్తున్నాయి. మన దేశంలోనూ టీకాలు ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున నడుస్తోంది. కాగా, ఇంకా కొంతమంది టీకాలు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. అపోహలు, భయాలు, అనుమానాలతో టీకాలకు దూరంగా ఉంటున్నారు.

  ఇదీ చదవండి : బ్యాంక్ పెట్టుకోవచ్చు అంటూ లక్షల్లో చీటింగ్.. పోలీసులకు సవాల్ విసురుతున్న మోసాలు

  కాగా, వ్యాక్సినేష‌న్‌ను వేగ‌వంతం చేసేందుకు ప్రభుత్వాలు వినూత్నంగా ఆలోచిస్తున్నాయి. ఇందులో భాగంగా బంప‌ర్ ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌మాదం పొంచి ఉన్న నేప‌థ్యంలో 100 శాతం వ్యాక్సినేష‌న్‌ను వేగంగా పూర్తి చేసేందుకు ప్ర‌భుత్వాలు స‌న్న‌ద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్.. వ్యాక్సినేషన్ రేటుని పెంచడానికి వినూత్నంగా ఆలోచించింది. బంప‌ర్ ఆఫ‌ర్‌ ప్ర‌క‌టించింది. వ్యాక్సిన్ వేయించుకుంటే స్మార్ట్ ఫోన్ ఫ్రీగా ఇస్తామంది.

  ఇదీ చదవండి : దేశ రాజధానిలో దారుణం.. కారు దిగి వెళ్తున్న మహిళను ఏం చేశారో చూస్తే షాక్ అవుతారు.. వీడియో వైరల్

  డిసెంబ‌ర్ 1 నుంచి డిసెంబ‌ర్ 7 మ‌ధ్య ఎవ‌రైతే రెండో డోసు వ్యాక్సిన్ తీసుకుంటారో వారిలో ఒక‌రిని ల‌క్కీ డ్రా తీస్తారు.. గెలుపొందిన వారికి 60వేల ఖరీదు చేసే స్మార్ట్ ఫోన్ ఇస్తామని ప్ర‌క‌టించింది. ఈ ఆఫర్ బాగానే పని చేసింది. జనాలు పెద్దఎత్తున వ్యాక్సిన్ వేయించుకోవ‌డానికి కేంద్రాల‌కు తరలి వ‌స్తున్నారు. కాగా, గ‌తంలో కూడా ఇలానే మురికివాడ‌ల్లో వ్యాక్సినేష‌న్ వేయించుకున్న వారికి కిలో వంట నూనెను ఫ్రీగా ఇచ్చారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Corona alert, Corona casess, Corona Vaccine, Covid vaccine, Gujarat news

  ఉత్తమ కథలు