Bumper offer: బంపర్ ఆఫర్.. టీకా వేసుకోండి 13 వేల రూపాయలు తీసుకెళ్లండి.. ఎక్కడో తెలుసా..?

ప్రతీకాత్మకచిత్రం

భారత్ లో కరోనా వ్యాక్సిన్ కు కొరత ఉంటే.. విదేశాల్లో మాత్రం వ్యాక్సిన్ వేసుకునేందుకు జనం ముందుకు రావడం లేదు. దీంతో అక్కడ ఆఫర్ల పై ఆఫర్లు కురిపిస్తున్నారు. ఏకంగా ఓ దేశ ప్రధాని అయితే క్యాష్ ఆఫర్ కూడా ఇచ్చారు.

  • Share this:
    కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే శ్రీ రామ రక్ష అని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకుంటే సైట్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయోమోనని చాలామంది దానికి దూరంగా ఉంటున్నారు. అపోహలను నమ్మోద్దని వైద్య అధికారులు సూచిస్తున్నప్పటికీ కొందరు భయం వీడడం లేదు. ముఖ్యంగా విదేశాల్లో యువత వ్యాక్సిన్ కోసం ముందుకు రావడం లేదు. మరోవైపు వ్యాక్సిన్ కొరత భారత దేశాన్ని పట్టి పీడిస్తుంది. వ్యాక్సిన్ కోసం ప్రజలు పడిగాపులు పడుతున్నారు. కాని విదేశాల్లో మాత్రం వ్యాక్సిన్ వేసుకునే వారు కరువయ్యారు..దీంతో వ్యాక్సిన్ వేసుకునే వారికి నజరానాలు ప్రకటిస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి బీరుతో పాటు, లాటరీ టికెట్స్, ఇతర నజరానాలు ప్రకటించాయి పలు దేశాలు. తాజాగా గ్రీస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఏకంగా క్యాష్ ఆఫర్ ప్రకటించింది.

    అగ్ర రాజ్యం అమెరికా అన్ని దేశాల కంటే ముందే వ్యాక్సిన్ కొనుగోలు చేసి నిల్వ చేసుకుంది.. ఒకదశలో ఆ దేశ అవసరాల కంటే ఎక్కువే ఆదేశం వ్యాక్సిన్ నిల్వలను సమకూర్చుకుందని చెబుతున్నారు. ఈ నేపధ్యంలోనే అమెరికా ఇంత చేసినా.. ఇప్పటి వరకు ఆదేశ జనాభాలోని సగం మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. అంటే మొత్తం 33 కోట్ల జనాభాలో కేవలం 16 కోట్లు మాత్రమే టీకా వేయించకున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాగా రెండు డోసులు వేసుకున్నవారు మాత్రం 12 కోట్ల మంది మాత్రమే అని చెబుతున్నారు. అయితే ఒక్కరోజులోనే సుమారు నలబై నుండి యాబై లక్షల వరకు టీకాల కోసం పోటెత్తిన ప్రజల ఉత్సాహం ప్రస్తుతానికి రోజుకు పది లక్షలు కూడ దాటటడం లేదని గణంకాలు చెబుతున్నాయి. మరోవైపు ఇటివలే అమెరికా మాస్క్‌లు లేకుండా తిరిగేందుకు అవకాశం కూడ ఇచ్చారు..  ఇలా అయితే థర్డ్ వేవ్‌ను తట్టుకోవడం కూడ కష్టంగా మారుతుందని భావిస్తున్న అగ్రదేశంలోని పలు రాష్ట్రాలు, వ్యాక్సిన్ కంపనీలు వ్యాక్సిన్ వేసుకునేందుకు తాయిళాలు ప్రకటిస్తున్నాయి. ఎండాకాలం కావడంతో వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఉచిత బీరును కొన్ని రాష్ట్రాల్లో ప్రకటించగా మరి కొన్ని ప్రాంతాల్లో అయితే పార్కుల్లో ఉచిత ప్రవేశంతోపాటు 50 లక్షల డాలర్ల లాటరీలు, ఉచిత ప్రయాణాల లాంటీ నజరానాలను ప్రకటించగా, రెస్టారెంట్స్‌లలో ఉచిత భోజనం ,వర్జీనియా రాష్ట్రంలో అయితే సేవింగ్ బాండ్స్ సైతం ప్రకటించారు. ఇలా ఓక్కో రాష్ట్రం ఒక్కో స్టైల్లో టీకా వేయించుకునేందుకు తాయిళాలు ప్రకటించగా.. ఇక న్యూయార్క్ రాష్ట్రం ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా గవర్నర్

    అమెరికాను తలదన్నే ఆఫర్లను ప్రకటించింది గ్రీస్ దేశం. తమ దేశంలోని 26 ఏళ్లలోపు యువతకు ఆ దేశ ప్రధానమంత్రి బ్రహ్మాండమైన ఆఫర్‌ ప్రకటించారు. కరోనా టీకా వేయించుకున్న వారికి 150 యూరోలు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.13,288. తొలి డోసు తీసుకున్న వారికి జూలై 15 నుంచి ఈ బహుమతిని అందజేస్తామన్నారు. గ్రీస్‌ దేశానికి ప్రధాన ఆదాయ వనరు పర్యాటకమే. దేశంలో అర్హులందరికీ కరోనా టీకా ఇచ్చి, పర్యాటకాన్ని పట్టాలెక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, వ్యాక్సినేషన్‌పై యువత ఆసక్తి చూపడం లేదు. అందుకే ఇలాంటి ఆఫర్లు ప్రకటించాల్సి వచ్చింది.
    Published by:Nagesh Paina
    First published: