Brucellosis: చైనాలో విస్తరిస్తున్న మరో మహమ్మారి.. 6వేల మందికి పాజిటివ్.. పెరుగుతున్న కేసులు

కరోనా వైరస్‌కు మూలబిందువుగా ఉన్న చైనా ఇప్పుడు మరో మహమ్మారి బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

news18-telugu
Updated: November 6, 2020, 2:44 PM IST
Brucellosis: చైనాలో విస్తరిస్తున్న మరో మహమ్మారి.. 6వేల మందికి పాజిటివ్.. పెరుగుతున్న కేసులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్‌కు మూలబిందువుగా ఉన్న చైనా ఇప్పుడు మరో మహమ్మారి బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది చివర్లో చైనాలోని వుహాన్లో కరోనా వైరస్ బయటపడింది. అనంతరం అది ప్రపంచం మొత్తానికి పాకింది. ఇప్పుడు ఒక బ్యాక్టీరియాతో వ్యాపించే వ్యాధి కేసులు ఆ దేశంలో పెరుగుతున్నాయి. గాన్సు ప్రావిన్స్ రాజధాని నగరమైన లాన్‌జౌలో సుమారు ఆరువేల మందికి పైగా బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి సోకినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

బ్రుసెల్లా అనే బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి సోకుతుంది. ఇది పశువులకు సోకే బ్యాక్టీరియా. గత సంవత్సరం దీనికి వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పరిశోధనలు చేస్తున్న క్రమంలో, వ్యాక్సిన్ ప్లాంట్ నుంచి బ్యాక్టీరియా లీక్ అయ్యింది. అదే ఇప్పుడు జంతువులకు, వాటి నుంచి మనుషులకు సోకుంతుందనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పటి వరకు లాన్‌జౌ నగరంలో 55,725 మందికి పరీక్షలు నిర్వహించినట్లు అక్కడి ప్రభుత్వం విలేకరుల సమావేశంలో తెలిపింది. వారిలో 6,620 మందికి బ్రూసెల్లోసిస్‌ నిర్ధారణ అయినట్లు చైనా అధికారిక వార్తాసంస్థ గ్లోబల్ టైమ్స్ గురువారం ఒక నివేదికలో తెలిపింది.

కేసులు పెరుగుతున్నాయి
లాన్‌జౌ హెల్త్ కమిషన్ ఈ వ్యాధికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. బ్రూసెల్లా అనే బ్యాక్టీరియా సోకిన పశువులకు దగ్గరగా ఉండటం వల్ల 6,000 మందికి పైగా బ్రూసెల్లోసిస్ వ్యాధి సోకిందని అక్కడి అధికారులు ధ్రువీకరించారు. సెప్టెంబర్ 14 నాటికి బ్రూసెల్లోసిస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,245గా ఉంది. కొన్ని రోజుల్లోనే వ్యాధిగ్రస్తుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది.

ఫ్లూ లక్షణాలు ఉంటాయి
బ్రుసెల్లా సోకిన జంతువులను ముట్టుకోవడం, వాటికి దగ్గరగా ఉండటం, కలుషితమైన మాంసాన్ని తినడం, లేదా గాలిలో ఉండే బ్యాక్టీరియాను పీల్చడం ద్వారా వ్యాధి మనుషులకు సోకే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వ్యాధి సోకిన వారిలో సాధారణ ఫ్లూ లక్షణాలు బయటపడతాయి. కొన్ని లక్షణాలు దీర్ఘకాలికంగా వేధిస్తాయి. కొంతమందిలో అవి ఎప్పటికీ తగ్గకపోవచ్చు.

 ప్రయోగశాల నుంచి లీక్

చైనా యానిమల్ హస్బెండరీ ఇండస్ట్రీ యాజమాన్యంలోని బయోఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ నుంచి బ్యాక్టీరియా వ్యాప్తి మొదలైందని సెప్టెంబరులో లాన్‌జౌ హెల్త్ కమిషన్ ప్రకటించింది. లాన్‌జౌ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో గతేడాది జూలై నుంచి ఆగస్టు వరకు బ్రూసెల్లోసిస్ వ్యాక్సిన్ల తయారీకి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ప్రమాదవశాత్తూ ప్రయోగశాల నుంచి బ్యాక్టీరియా లీకైంది. దీంతో దాన్ని నాశనం చేయడానికి పరిశోధకులు కొన్ని రకాల క్రిమిసంహారక మందులను వాడారు. కానీ అవి గడువు ముగిసినవి కావడంతో బ్యాక్టీరియా నశించకుండా, గాల్లోకి వ్యాపించింది. బ్రూసెల్లోసిస్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ వర్కషాప్‌ను గత ఏడాది డిసెంబర్‌లో మూసివేసినట్లు గ్లోబల్ టైమ్స్ తెలిపింది. ఈ అక్టోబర్‌లో దాన్ని కూల్చివేసినట్లు ఆ వార్తాసంస్థ ప్రకటించింది.
Published by: Sumanth Kanukula
First published: November 6, 2020, 2:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading