కరోనాతో మాజీ ఎమ్మెల్యే మనవళ్లు మృతి.. 20 రోజుల వ్యవధిలో..

కరోనా కారణంగా 20 రోజుల వ్యవధిలో ఇద్దరు అమ్మదమ్ములు చనిపోయారు.

news18-telugu
Updated: August 12, 2020, 1:54 PM IST
కరోనాతో మాజీ ఎమ్మెల్యే మనవళ్లు మృతి.. 20 రోజుల వ్యవధిలో..
కరోనాతో మృతి చెందిన అన్నదమ్ములు
  • Share this:
కరోనా మహమ్మారి అనేక కుటుంబాల్లో విషాదం నింపుతోంది. వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడేవారితో పాటు యువకులు కూడా ఈ వైరస్ బారిన పడి చనిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కరోనా కారణంగా ఇద్దరు అమ్మదమ్ములు చనిపోయారు. ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యే మనవళ్లు కావడం గమనార్హం. గురజాల మాజీ ఎమ్మెల్యే కొత్త వెంకటేశ్వర్లు మనువళ్లు కొత్త నరేష్‌, కొత్త రామకృష్ణ కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోవడం దాచేపల్లిలో విషాదం నింపింది. కొత్త వెంకటేశ్వర్లు కుమారుడు కోటేశ్వరరావు, రత్నకుమారికి కుమారులైన నరేశ్, రామకృష్ణ.. 20 రోజుల వ్యవధిలో కరోనా కారణంగా చనిపోయారు. గత నెలలో నరేష్‌ అనారోగ్యానికి గురికావటంతో కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్‌ తేలింది.

కరోనాతో బాధపడుతున్న నరేష్‌ వద్ద సేవలు చేసేందుకు తమ్ముడు రామకృష్ణ ఉన్నాడు. ఈ క్రమంలో కరోనాతో వైద్యం పొందుతున్న నరేష్‌ గత నెల 21వ తేదీన మృతి చెందాడు. నరేష్‌ మృతి చెందిన తరువాత రామకృష్ణ కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో అతడు నరసరావుపేటలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో చికిత్స చేయించుకున్నాడు. అయితే అక్కడ పరిస్థితి మెరుగుపడకపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ రామకృష్ణ మంగళవారం మృతి చెందాడు.
Published by: Kishore Akkaladevi
First published: August 12, 2020, 1:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading