ఆ దేశంలో కరోనా కల్లోలం... వ్యాక్సిన్ పంపిణీ చేస్తూనే లాక్‌డౌన్..

ఆ దేశంలో కరోనా కల్లోలం... వ్యాక్సిన్ పంపిణీ చేస్తూనే లాక్‌డౌన్..

(ప్రతీకాత్మక చిత్రం )

క్రిస్మస్ నేపథ్యంలో ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్‌లోనూ మళ్లీ లాక్‌డౌన్ ప్రకటించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

 • Share this:
  కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా ? అని మనతో సహా ప్రపంచంలోని అనేక దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే అనేక దేశాల్లో కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కూడా లభించింది. అయితే కరోనా విజృంభన నేపథ్యంలో కొన్ని దేశాల్లో పరిస్థితి అదుపు తప్పుతోతంది. బ్రిటన్‌లోనూ ఇలాంటి పరిస్థితి ఉంది. తమ దేశంలో కొత్తరకం కరోనా వైరస్‌ నియంత్రణలో లేదని బ్రిటన్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మాట్ హాన్కాక్ అంగీకరించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో లండన్‌తోపాటు ఆగ్నేయ ఇంగ్లండ్‌లో టైర్-4 లాక్ డౌన్ విధిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఈ క్రిస్మస్‌కు ప్రజలు ఇచ్చే ఉత్తమమైన బహుమతి వైరస్‌ను వ్యాప్తి చేయకుండా ఇంట్లో ఉండటమేనని మాట్ హాన్సాక్ తెలిపారు.

  దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందేవరకు.. అవసరాన్ని బట్టి కొన్ని నెలల పాటు లండన్‌లో లాక్‌డౌన్ కొనసాగవచ్చని హాన్కాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు యూరోపియన్ దేశాలు ఆదివారం నుంచి బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను నిషేధించడం మొదలుపెట్టాయి. ఆదివారం నుంచి బ్రిటన్‌ ప్రయాణీకుల విమానాలపై నిషేధం అమల్లోకి వస్తుందని నెదర్లాండ్స్ ఇప్పటికే ప్రకటించింది. వేల్స్ మరోసారి లాక్ డౌన్‌లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో ఇంగ్లాండ్ నుంచి రాకపోకలపై స్కాట్ లాండ్ కూడా బ్యాన్ విధించింది.

  బెల్జియం కూడా ఈ అర్ధరాత్రి నుండి బ్రిటన్ నుండి విమాన మరియు రైలు రాకలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. జర్మనీ ప్రభుత్వం కూడా ఇదే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక దేశంలో కొత్తరకం కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తోందని.. ఈ వైరస్‌ 70 శాతం ఎక్కువ వేగంగా ఇది వ్యాప్తి చెందుతోందని వైద్య అధికారులు తెలిపారు. ఈ కొత్తరకం వైరస్‌ను వాక్సిన్‌ నిరోధిస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవని ఆయన తెలిపారు. మరోవైపు ఈ నెల 8 నుంచే బ్రిటన్‌లో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించగా... ఇప్పటివరకు బ్రిటన్ లో 3లక్షల 50 వేల మందికి తొలి డోసు టీకా అందించారు. ఇక క్రిస్మస్ నేపథ్యంలో ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్‌లోనూ మళ్లీ లాక్‌డౌన్ ప్రకటించారు.
  Published by:Kishore Akkaladevi
  First published: