బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్‌కు కరోనా పాజిటివ్...

బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ (71) కరోనా బారిన పడ్డారు. అయితే, ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్టు అధికార ప్రతినిధి తెలిపారు.

news18-telugu
Updated: March 25, 2020, 4:41 PM IST
బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్‌కు కరోనా పాజిటివ్...
ప్రిన్స్ చార్లెస్
  • Share this:
బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ (71) కరోనా బారిన పడ్డారు. అయితే, ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్టు అధికార ప్రతినిధి తెలిపారు. ఆయన భార్య కామిల్లా (72)కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే, కరోనా వైరస్ సోకలేదని నిర్ధారించారు. ప్రస్తుతం వారిద్దరూ బాల్‌మోరల్‌లో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. గత కొన్ని రోజులుగా ప్రిన్స్ చార్లెస్ ఇంటి వద్దే ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. ‘ప్రభుత్వం, వైద్యుల సూచనల ప్రకారం ప్రిన్స్ చార్లెస్, కామిల్లా ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. స్కాట్లాండ్‌లోని నివాసంలో వారు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. వారికి పరీక్షలు నిర్వహించగా, కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారించారు. అయితే, ఎవరి ద్వారా ప్రిన్స్ చార్లెస్‌కు కరోనా వైరస్ సోకిందనేది తెలియలేదు. ఈ మధ్య కాలంలో ప్రిన్స్ చార్లెస్ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు.’ అని అధికారిక ప్రకటనలో తెలిపారు.

First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు