పెళ్లైన మూడో రోజే వధువుకు కరోనా.. వరుడు సహా 32 మంది క్వారంటైన్

అప్రమత్తమైన వైద్యాధికారులు వరుడు సహా ఇరు కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేశారు. ఇతర బంధువులతో కలిపి మొత్తం 32 మందిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు.

news18-telugu
Updated: May 21, 2020, 9:55 PM IST
పెళ్లైన మూడో రోజే వధువుకు కరోనా.. వరుడు సహా 32 మంది క్వారంటైన్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతి రోజు 5వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఓ నవ వధువుకు కరోనా వైరసో సోకింది. పెళ్లైన 3 రోజులకే పరీక్షల్లో కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. సోమవారం వివాహం జరగ్గా.. బుధవారం ఆమెకున్న కరోనా ఉన్నట్లు పరీక్షల్లో తెలిసింది. దాంతో అప్రమత్తమైన వైద్యాధికారులు వరుడు సహా ఇరు కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేశారు. ఇతర బంధువులతో కలిపి మొత్తం 32 మందిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు.

కాగా, మధ్యప్రదేశ్ వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 221 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇవాళ 159 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. తాజా లెక్కలతో మధ్యప్రదేశ్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,956కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 2,892 మంది కోలుకోగా.. 267 మంది మరణించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో 2,797 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: May 21, 2020, 9:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading