బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారోకు కరోనా పాజిటివ్

అమెరికా తర్వాత ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు బ్రెజిల్‌లోనే నమోదయ్యాయి. బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 16,28,283 మంది కరోనా బారినపడ్డారు.

news18-telugu
Updated: July 7, 2020, 9:23 PM IST
బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారోకు కరోనా పాజిటివ్
బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో
  • Share this:
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కబళిస్తోంది. అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యా, పెరూ, చిలీలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం కరోనా బారినపడుతున్నారు. చివరకు దేశాల అధినేతలు సైతం కరోనా బాధితులవుతున్నారు. తాజాగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో (65)కు కరోనా వైరస్ సోకింది. ఇటీవల ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దాంతో ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.బొల్సొనారో కుటుంబ సభ్యులతో పాటు ఇటీవల ఆయన్ను కలిసిన వారిని గుర్తించి వారికి కూడా పరీక్షలు చేస్తున్నారు.

అమెరికా తర్వాత ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు బ్రెజిల్‌లోనే నమోదయ్యాయి. బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 16,28,283 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో కరోనా నుంచి కోలుకొని 10,72,229 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 65,631 మంది మరణించారు. ప్రస్తుతం బ్రెజిల్‌లో 4,90,423 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. వీరిలో 8,318 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
Published by: Shiva Kumar Addula
First published: July 7, 2020, 9:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading