COVID: కరోనాకు ఈ పాము విషమే సరైన మందు... కొత్త పరిశోధనలో వెల్లడి!

జరారాకుస్సు పిట్ వైపర్ (image credit - reuters)

COVID: పాము విషం డైరెక్టుగా మన బాడీలోకి ఎక్కితే మనం చనిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ అదే విషంతో తయారుచేసే మందులు ప్రాణాలు కాపాడుతుండటం విశేషం.

 • Share this:
  COVID: ఏం చేస్తే కరోనా చస్తుంది? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాని ప్రపంచ దేశాలు ప్రయత్ని్స్తున్నాయి. డజనుకుపైగా వ్యాక్సిన్లు ఉన్నా... ఏ ఒక్కటీ పూర్తిగా కరోనాను ఆపలేకపోతున్నాయి. మరెలా అంటే... బ్రెజిల్ (brazil) లోని పరిశోధకులు ఆశక్తికర విషయం చెప్పారు. ఓ రకమైన పాము విషంలో వారికి ఓ మాలిక్యూల్ (molecule) లభించింది. అది... కోతుల కణాల్లో... కరోనా తిరిగి వృద్ధి (reproduction) చెందకుండా ఆపేస్తుందని తేల్చారు. సో... ఈ మాలిక్యూల్‌తో మందును తయారుచేసేందుకు ఇది తొలి అడుగు అనుకోవచ్చు. ఈ మందు (Medicine) తయారైతే... దాన్ని ప్రపంచదేశాలు ఉపయోగిస్తే... ఇక కరోనా పని అయిపోయినట్లే అనుకోవచ్చు.

  విషపూరితమైన పాము:
  ఈ అధ్యయన వివరాల్ని సైంటిఫిక్ జర్నల్ మాలిక్యూల్స్‌లో రాశారు. బ్రెజిల్‌లో జరారాకుస్సు పిట్ వైపర్ (jararacussu pit viper) అనే పాము ఉంటుంది. ఫొటోలో ఉంది కదా అదే అది. చాలా అందమైన పాము. కానీ చాలా విషపూరితమైనది. దక్షిణ అమెరికా (south america) అంతటా ఇవి ఉంటాయి. ఇది దాదాపు 7 అడుగుల పొడవు పెరగగలదు. ఇది అట్లాంటిక్ అడవుల తీరాల్లో, బొలీవియా, పరాగ్వే, అర్జెంటినాలో కనిపిస్తుంది. ఈ పాము విషంలోని మాలిక్యూల్‌... కరోనా వైరస్ వృద్ధిని 75 శాతం వరకూ పెరగకుండా ఆపేస్తుందని అధ్యయనం తేల్చింది.

  జరారాకుస్సు పిట్ వైపర్ (image credit - wikipedia)


  "పాము విషం నుంచి తీసే ఈ కాంపొనెంట్... వైరస్‌కి చెందిన ముఖ్యమైన ప్రోటీన్‌ను వృద్ధి చెందకుండా ఆపేస్తోంది" అని సావో పాలో యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్, ఈ అధ్యయన రచయిత రాఫెల్ గుయ్డో (Rafael Guido) తెలిపారు.

  మంచి పరిశోధన:
  ఈ మాలిక్యూల్‌లో అమైనో యాసిడ్లు ఉన్నాయి. ఈ మాలిక్యూల్ ఏం చేస్తుందంటే... కరోనా వైరస్ దగ్గరకు వెళ్లి దానికి ఉండే PLప్రో అనే ఎంజైమ్‌కి కనెక్ట్ అవుతుంది. ఆ ఎంజైమ్ వల్లే కరోనా వైరస్ వృద్ధి చెందుతోంది. ఎంజైమ్‌కి మాలిక్యూల్ కనెక్ట్ అవ్వడంతో... వృద్ధి ఆగిపోతోంది. ఈ ప్రక్రియలో కణాలకు హాని జరగట్లేదు. కాబట్టి కరోనా (coronavirus) మాత్రమే వృద్ధి చెందకుండా ఆగిపోతుంది అనుకోవచ్చు.

  పాములకు శాపం:
  బ్రెజిల్‌లో చాలా మంది జరారాకుస్సు పాముల్ని వేటాడి మరీ చంపేస్తుంటారు. తద్వారా వాళ్లు ఈ ప్రపంచాన్ని కాపాడుతున్నాం అనుకుంటారు. నిజానికి ఇప్పుడు ఈ పాములే మనకు దిక్కయ్యేలా ఉన్నాయి. ఈ పాములు ఎంత ఎక్కువగా పెరిగితే... అంత ఎక్కువగా వీటి నుంచి విషాన్ని సేకరించగలరు. అలా సేకరించిన విషంలో ఆ మాలిక్యూల్స్‌ని సేకరించి... వ్యాక్సిన్ తయారుచెయ్యాల్సి ఉంటుంది. ఇదంతా పెద్ద పనే.

  ఇది కూడా చదవండి: వధువు కావలెను.. అని షాప్‌ ముందు బోర్డ్ పెట్టాడు.. అనూహ్య పరిణామంతో షాక్!

  త్వరలో పరిశోధకులు ఎంత మాలిక్యూల్ బాడీలోకి పంపితే... ఎంత స్థాయిలో కరోనా వృద్ధి ఆగిపోతుంది అనేది ప్రయోగాలు చేయనున్నారు. అసలు కరోనా... కణాల్లోకి వెళ్లకుండా ఈ మాలిక్యూల్ అడ్డుకోగలదా అన్నదాన్ని సావో పాలో యూనివర్శిటీలో తేల్చనున్నారు. లక్కీగా అదే జరిగితే... ఇక కరోనా నుంచి ప్రపంచం బయటపడినట్లే అనుకోవచ్చు.
  Published by:Krishna Kumar N
  First published: