కరోనా భయం... వ్యోమగాముల సూట్‌తో బీచ్‌కి వచ్చిన దంపతులు...

వాళ్లను అలా చూసి... అంతా షాకవుతున్నారు. అంత ఇబ్బంది పడుతూ బీచ్‌కి రావడం అవసరమా అంటున్నారు.

news18-telugu
Updated: July 13, 2020, 1:00 PM IST
కరోనా భయం... వ్యోమగాముల సూట్‌తో బీచ్‌కి వచ్చిన దంపతులు...
కరోనా భయం... వ్యోమగాముల సూట్‌తో బీచ్‌కి వచ్చిన దంపతులు... (credit - instagram)
  • Share this:
ప్రపంచంలో అమెరికా తర్వాత... ఎక్కువ కరోనా కేసులు ఉన్న బ్రెజిల్‌లో ఈ ఘటన జరిగింది. తమ దేశంలో రోజూ 30వేల దాకా కొత్త కేసులు నమోదవుతుంటే... బ్రెజిల్ ప్రజలు కరోనా నుంచి ఎలా తప్పించుకోవాలా అని రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. వ్యాక్సిన్ ఇంకా రాలేదు. రష్యాలో ఓ వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తయ్యాయని చెప్పారేగానీ... వ్యాక్సిన్ అనుమతులకు కనీసం నెల రోజులు పడుతుంది. ఆ తర్వాత ప్రపంచానికి సరిపడా ఉత్పత్తి చెయ్యడానికి మరో సంవత్సరమైనా పడుతుంది. అందువల్ల అప్పటివరకూ ఈ కరోనాతో జాగ్రత్త పడాల్సిందే అనుకుంటూ ప్రజలు కొత్త కొత్తగా ఆలోచిస్తున్నారు.

బ్రెజిల్‌లో అధ్యక్షుడు బోల్సోనారోకే కరోనా వచ్చేసింది. అందువల్ల అక్కడి ప్రజలే స్వయంగా అన్ని జాగ్రత్తలూ పాటించుకుంటూ కరోనాకు దొరకకుండా తప్పించుకుంటున్నారు. అలా తప్పించుకోలేనివారు దొరికిపోతున్నారు. ఇప్పటివరకూ మనం రకరకాల మాస్కులు చూశాం. తాజాగా ఓ జంట రియోడీ జనీరోలో... స్పేస్ సూట్‌తో బీచ్‌కి వచ్చింది. సాధారణంగా డాక్టర్లు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (PPE)లను ధరిస్తారు. ఇక్కడ ఈ జంట... పీపీఈ లాంటి, స్పేస్ సూట్ లాంటి డ్రెస్‌తో వచ్చేసరికి... అంతా వాళ్లనే కళ్లప్పగించి చూశారు.
అతనిపేరు టెర్సియో గాల్డినో. అకౌంటెంట్. ఆయన భార్య పేరు అలీసియా లిమా. ఇద్దరూ ఆస్ట్రోనాట్ కాస్ట్యూమ్ ఎందుకు వేసుకున్నారన్న ప్రశ్నకు ఆన్సర్ కరోనాయే. కనీసం అలాంటి సూట్‌లో ఉంటేనైనా కరోనా సోకకుండా ఉంటుందేమో అని వాళ్లు ఆ ప్రయత్నం చేశారు. నెటిజన్లు కూడా వాళ్లకు మద్దతిస్తున్నారు. "తప్పేముంది... కరోనా పట్ల వాళ్లు అంత జాగ్రత్త తీసుకుంటున్నారు. మంచిదేగా" అంటున్నారు. నిజమే... కరోనా గాల్లో కూడా ప్రయాణిస్తోందని మొన్ననే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్పింది. కాబట్టి... మనం బయట తిరిగేటప్పడు... వీలైనంత ఎక్కువ జాగ్రత్తలు పాటించడం మేలే.
Published by: Krishna Kumar N
First published: July 13, 2020, 1:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading