HOME »NEWS »Corona vilayatandavam »brain eating amoeba now spreading very fast in us su gh

Brain- Eating Amoeba: అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న మరో వ్యాధి.. అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తల హెచ్చరికలు

Brain- Eating Amoeba: అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న మరో వ్యాధి.. అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తల హెచ్చరికలు
ప్రతీకాత్మక చిత్రం

రోనా వైరస్(Corona virus) సృష్టించిన బీభత్సం గురించి ప్రపంచం ఇంకా కోలుకోకముందే.. మరో సూక్ష్మ జీవి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది.

  • Share this:
కరోనా వైరస్(Corona virus) సృష్టించిన బీభత్సం గురించి ప్రపంచం ఇంకా కోలుకోకముందే.. మరో సూక్ష్మ జీవి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇది నేరుగా మనిషి మెదడుపై దాడి చేసే వారిని చంపేస్తుంది. ‘నెగ్లెరియా ఫోవ్లేరి’(Naegleria fowleri) గా పిలిచే అమీబా జాతికి చెందిన ఈ సూక్ష్మజీవి(micro- organism) ప్రస్తుతం అమెరికా(America), ఇతర దేశాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. కాగా, చాలా కాలం పాటు ప్రచారంలో లేని ఈ వ్యాధి ఇది వరకు దక్షిణ అమెరికాలో మాత్రమే ప్రభావాన్ని చూపింది. అయితే, ప్రస్తుతం క్రమంగా ఉత్తర అమెరికా అంతటా వ్యాపిస్తుందన్న వార్తల నేపథ్యంలో మళ్లీ ప్రచారంలోకి వచ్చింది .

కాగా, సెప్టెంబర్ 8న టెక్సాస్(Texas )లోని హ్యుస్టన్ నగరం సమీపంలో ఓ ఆరేళ్ల బాలుడు విపరీతమైన తలనొప్పి, వాంతులు తదితర లక్షణాలతో చనిపోయాడు. ఆ బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా అమీబా కారణమని తేలింది. దీంతో టెక్సాస్ రాష్ట్ర వ్యాప్తంగా విపత్తు ప్రకటన జారీ చేశారు అక్కడి అధికారులు. ఈ ఘటనతో అమీబా మరోసాని వ్యాప్తి చెందే ప్రమాదముందని అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, దీనిపై విశ్లేషిస్తున్న సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC), వాతావరణ మార్పులే దీనికి ప్రధాన కారణమని ప్రాధమికంగా నిర్థారించింది. వాతావరణ మార్పుల వల్ల ప్రాణాంతకమైన మెదడు తినే అమీబా(Amoeba) క్రమంగా మనిషి శరీరంలో విస్తరిస్తున్నట్లు తేల్చింది. ఇది నాసికా పొరల ద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశించి మెదడులోకి చొచ్చుకుపోతుంది. దీనివల్ల శక్తివంతమైన విపరీతమైన తలనొప్పి, వాంతులు, మెడపట్టేయడంతో పాటు చిరాకు, అలసట, మైకము, గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మతిమరుపు, భయం వంటివి ఏర్పడతాయి.గత పదేళ్లలో 34 కేసులు నమోదు..
అమీబా సూక్ష్మజీవులు సాధారణంగా కాల్వలు, చిన్నచిన్న గురికి గుంటలు, అపరిశుభ్ర స్మిమ్మింగ్ పూల్స్, తాగునీటి కుళాయిల వద్ద ఎక్కువగా నివసిస్తాయి. అంతేకాక, ఇవి వెచ్చని మంచినీరు, మట్టిలో కూడా నివసిస్తున్నట్లు ఎమర్జింగ్ ఇన్ఫెక్లియోస్ డిసీజెస్(Emerging Infectious Diseases) నివేదికలో పేర్కొనబడింది. ముఖ్యంగా, అమీబా మన ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తున్నందున, కలుషితమైన నీటిలో ఈత కొట్టడం కూడా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అందువల్ల, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, స్నానానికి, వంట కోసం వీలైనంత వరకు కుళాయి నీటిని వాడకపోవడమే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, అమీబా (Amoeba) వల్ల కలిగే వ్యాధిని ఎసెన్షియల్ అమేబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) గా పిలుస్తారు. ఈ వ్యాధి కారణంగా గత పదేళ్లలో (2010–2019) 34 సంక్రమణ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా జూలై, ఆగస్టు, సెప్టెంబరుతో పాటు వేసవి ఉండే నెలల్లో వ్యాధి సంక్రమణ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అమీబా పెరగడానికి ఈ నెలల్లో ఉండే వేడి వాతావరణం దోహదం చేస్తుంది. అయితే, వ్యక్తి శరీరంలో అమీబా ఉనికిని గుర్తించడానికి ఇప్పటివరకు ఎటువంటి పరీక్షలు రూపొందించబడలేదు. తద్వారా, వ్యాధి నిర్థారణకుఎక్కువ రోజులు పట్టే అవకాశం ఉంది.
Published by:Sumanth Kanukula
First published:December 22, 2020, 16:06 IST

टॉप स्टोरीज