బ్రహ్మంగారి మఠం పేరుతో వదంతులు విన్నారా? అసలు నిజం ఇదే...

బ్రహ్మంగారి మఠంలో ఆలయ పూజారి చనిపోతూ కరోనా వైరస్‌కు విరుగుడు మందు చెప్పారంటూ ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: March 27, 2020, 10:58 PM IST
బ్రహ్మంగారి మఠం పేరుతో వదంతులు విన్నారా? అసలు నిజం ఇదే...
కరోనా వైరస్, బ్రహ్మంగారు
  • Share this:
ప్రస్తుతంకరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా రోజుకు ఇబ్బడిముబ్బడిగా కొత్త కొత్త ప్రచారాలు బయటకు వస్తున్నాయి. ఫలానా వాళ్లు అలా చెప్పారని, ఇలా చెప్పారని, ఫలానా విధంగా చేస్తే కరోనా సోకదంటూ భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ కోవలోకే బ్రహ్మంగారి మఠాన్ని కూడా చేర్చారు. బ్రహ్మంగారి మఠంలో ఆలయ పూజారి చనిపోయాడని, మిరియాలు, అల్లం, బెల్లం కలుపుకొని తాగితే కరోనా రాదంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన దహన సంస్కారాలు పూర్తయ్యేలోపే ఈ కషాయం తాగాలంటూ కూడా కండిషన్లు పెడుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బ్రహ్మంగారిమఠం ఆలయ మేనేజర్ ఈశ్వరయ్య చారి స్పందించారు. బ్రహ్మంగారిమఠం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. ఆలయంలోని పూజారి చనిపోయాడని వస్తున్న వార్తలు అవాస్తవాలని స్ఫష్టం చేశారు. మిరియాలు, అల్లం, బెల్లం, కలిపి నీటిని త్రాగితే కరోనా వ్యాధిని నివారించవచ్చని బ్రహ్మంగారు చెప్పినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు నిజం కావని తేల్చి చెప్పారు. అలాంటి అవాస్తవాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. ఈ కథనాలు సోషల్ మీడియాలో ప్రచురించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, సైబర్ నేరంకింద వారిపై కేసు నమోదుకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇదే విషయాన్ని రాష్ట్ర డీజీపీ, కడప ఎస్పీకి లేఖలు పంపుతున్నట్టు చెప్పారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: March 27, 2020, 10:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading